Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేందుకు మనం చేసే తప్పులు, పాటించే అలవాట్లు కూడా కారణం అవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శారీరక శ్రమ చేయకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల అధికంగా బరువు పెరిగి స్థూలకాయం సమస్య వస్తుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక బరువును తగ్గించుకోవాలి. బరువు తగ్గాక దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. దీంతో స్ట్రోక్స్ రాకుండా నివారించవచ్చు.
2. ధూమపానం చాలా హానికరమైన అలవాటు. దీని వల్ల మీ గుండె ఆరోగ్యం, శ్వాసకోశ వ్యవస్థ పనితీరు దెబ్బతింటాయి. పొగ తాగడం వల్ల స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక పొగ తాగడం మానేయాలి. దీంతో స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు.
3. అధికంగా మద్యం సేవించడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. లివర్ చెడిపోతుంది. అధికంగా బరువు పెరుగుతారు. అయితే అధిక మద్యపానం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుందని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. కనుక మద్యాన్ని అధికంగా సేవించరాదు.
4. అధికంగా బీపీ ఉండడం, హై కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ నియంత్రణలో లేకపోవడం, అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం.. వంటివన్నీ బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంటాయి. కనుక ఈ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఉన్నవారు అదుపులో పెట్టుకోవాలి. దీంతో బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.