Walnuts Laddu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది రోజూ జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. పోషకాలు ఉండే ఆహారాలను తినడం లేదు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తింటే చాలు. పోషకాహార లోపం అన్న సమస్యే ఉండదు. పైగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ లడ్డూలను ఎలా తయారు చేయాలంటే..
150 గ్రాముల నువ్వులు, 150 గ్రాముల పల్లీలు, 250 గ్రాముల వాల్ నట్స్ తీసుకోవాలి. వాల్ నట్స్‌ను మిక్సీలో వేసి మెత్తగా కాకుండా పొడిగా పట్టుకోవాలి. అలాగే నువ్వులు, పల్లీలను పెనంపై వేసి వేయించాలి. తరువాత నువ్వులను కూడా పొడిలా చేసుకోవాలి. అనంతరం పల్లీలను పొట్టు తీసి వాటిని కూడా పొడిగా పట్టుకోవాలి. అనంతరం ఈ మూడు రకాల పొడిలను కలపాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి కూడా వేయాలి. ఆ తరువాత ఆ మిశ్రమంలోకి సరిపోయేట్లు బెల్లం పాకంను సిద్ధం చేసుకోవాలి. అనంతరం అందులో ఆ మిశ్రమాన్ని వేసి కలుపుతూ లడ్డూల్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజుకు ఒక్కటి తింటే చాలు.. అనేక లాభాలు కలుగుతాయి.
పైన చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒక్కటి తింటే.. చిన్నారుల్లో మెదడు చురుగ్గా మారుతుంది. బద్దకం, సోమరితనం పోతాయి. చురుగ్గా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. వాల్ నట్స్, నువ్వులు, పల్లీల్లో ఉండే పోషకాలు చిన్నారులకు ఎంతగానో మేలు చేస్తాయి.
ఈ లడ్డూలను వృద్ధులు తింటే కీళ్ల నొప్పులు ఉండవు. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. రక్తం తక్కువగా ఉన్నవారు ఈ లడ్డూలను తింటుంటే కొద్ది రోజుల్లోనే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రోజూ శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసేవారు ఈ లడ్డూలను తింటే అమితమైన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. నీరసంగా, నిస్సత్తువగా ఉండేవారు కూడా వీటిని తింటే శక్తి వస్తుంది. చురుగ్గా ఉంటారు.
సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. కానీ ఈ లడ్డూలను తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఈ లడ్డూలను తినడం వల్ల వాటిల్లో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. బాడీ పెయిన్స్ ఉన్నవారు ఈ లడ్డూలను తింటే ఆ నొప్పుల నుంచి బయట పడవచ్చు. ఇలా ఈ లడ్డూలతో ఎన్నో లాభాలు కలుగుతాయి.