Thotakura : పురుషుల సమస్యలను పోగొట్టే తోటకూర.. దీంట్లోని ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Thotakura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరలు, కూరగాయల్లో తోట కూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ తోటకూర మనకు నిజంగా ఆరోగ్య్ ప్రదాయిని అని చెప్పవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

men should take Thotakura these are its other benefits

1. తోటకూరలో లేని పోషకాలు అంటూ ఉండవు. అన్ని పోషకాలూ ఇందులో ఉంటాయి. అందువల్ల దీన్ని పోషకాలకు గని అని చెప్పవచ్చు. తోటకూరలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుంది.

2. దీంట్లో ఉండే విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. తోటకూరలో విటమిన్‌ డి కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహాయ పడుతుంది.

3. తోటకూరలో ఉండే విటమిన్‌ ఇ పురుషుల్లో శృంగార సమస్యలను పోగొడుతుంది. తరచూ దీన్ని తీసుకుంటే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది.

4. తోటకూరలో ఉండే విటమిన్‌ కె రక్త స్రావం అయినప్పుడు, గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు సహాయ పడుతుంది. అలాగే తోటకూరలోని విటమిన్‌ బి12 నొప్పులను తగ్గిస్తుంది. రక్త కణాలు తయారయ్యేలా చేస్తుంది.

5. తోటకూరలో ఉండే ఐరన్‌ వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే తోటకూరలో విటమిన్‌ బి6, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం, సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌, షుగర్‌ లెవల్స్‌ ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

6. తోటకూరను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్‌, మలబద్దకం, అసిడిటీ తగ్గుతాయి. దీంట్లో ఉండే జింక్‌ పురుషుల్లో వీర్య కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

7. తోటకూరలో పాలకన్నా కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి.

8. హైబీపీ ఉన్నవారు తోటకూరను తింటే మంచిది. దీని వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. తోటకూరను తింటే మలబద్దకం, పైల్స్‌ నుంచి బయట పడవచ్చు.

తోటకూరను రోజూ నేరుగా కూర రూపంలో తినవచ్చు. అలా తినలేం అనుకుంటే ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ సమయంలో ఒక కప్పు జ్యూస్‌ తాగవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.

Editor

Recent Posts