Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో ఉండే చెట్టు ఇది.. దీంట్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Kanuga Chettu : మన చుట్టూ పరిసరాల్లో అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల వాటిని వారు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇక అలాంటి వృక్షాల్లో కానుగ ఒకటి. ఇది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానుగ చెట్టుకు చెందిన పలు భాగాలను ఉపయోగించి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

amazing health benefits of Kanuga Chettu

1. కానుగ చెట్టు ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే గ్యాస్‌, అసిడిటీ, కడుపులో నొప్పి, మలబద్దకం, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు కూడా తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

2. బాగా వేడిగా ఉండే గంజిలో కానుగ ఆకులను ఒకటి రెండు వేయాలి. కొంత సేపు ఉన్నాక ఆ ఆకులను తీసేయాలి. అనంతరం ఆ గంజిని తాగాలి. ఇలా తాగడం వల్ల వాంతులు తగ్గిపోతాయి.

3. కానుగ చెట్టుకు బాదం కాయల్లాగే కాయలు కాస్తాయి. వీటి లోపల విత్తనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి.

4. గాయాలు అయినప్పుడు కానుగ గింజలను మెత్తగా నూరి తేనె లేదా నెయ్యి లేదా చక్కెర ఏదో ఒక దానితో కలిపి తీసుకోవడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. గాయాలు త్వరగా మానుతాయి.

5. కానుగవేర్లను సేకరించి శుభ్రం చేసి ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడిలా చేయాలి. దాన్ని కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాన్ని గడ్డలపై రాసి కట్టులా కట్టాలి. దీంతో గడ్డలు త్వరగా పగిలిపోతాయి. అందులో ఉండే చీము త్వరగా బయటకు వస్తుంది. అవి త్వరగా తగ్గిపోతాయి.

6. పైల్స్‌ సమస్య ఉన్నవారికి కానుగ చెట్టు బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ బెరడును నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని మొలలపై రాస్తుండాలి. దీంతో మొలలు తగ్గిపోతాయి.

7. కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా మనకు ఉపయోగపడుతుంది. దేవుడికి దీపాలకు పెట్టే నూనెకు బదులుగా కానుగ నూనెను వాడవచ్చు. దీంతో ఆ నూను కాలడం వల్ల వచ్చే వాసనకు చుట్టూ ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి. గాలి శుభ్రమవుతుంది.

8. కానుగ నూనెను రాస్తుంటే గజ్జి, తెల్ల మచ్చలు, తామర వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి ఛాతిపై రాస్తే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి.

9. వేప పుల్లలతో చాలా మంది దంతాలను శుభ్రం చేసుకుంటారు. అయితే కానుగ చెట్టు పుల్లలతోనూ నోరు, దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇవి కూడా దంతాలను తోముకునేందుకు చక్కగా పనిచేస్తాయి. వీటితో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే పొక్కులు, పుండ్లు తగ్గుతాయి.

ఈ విధంగా కానుగ చెట్టుకు చెందిన ఆయా భాగాలు మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కనుక కానుగచెట్టు కనిపించినప్పుడు వాటిని ఇంటికి తెచ్చుకోవడం మరిచిపోకండి..!

Share
Admin

Recent Posts