Korrala Pongali : కొర్రలను రుచిగా ఇలా పొంగలిలా వండండి.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి..!

Korrala Pongali : ప్రస్తుత తరుణంలో చాలా మంది చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. వీటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతోనూ అనేక లాభాలు కలుగుతాయి. వీటిని ఎలా వండుకోవాలి.. అని కొందరు సందేహిస్తుంటారు. నేరుగా అయితే తినలేకపోతుంటారు. కానీ వీటిని ఎంతో రుచికరంగా ఉండేలా వండుకోవచ్చు. వీటితో పొంగలి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొర్రలతో పొంగలిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Korrala Pongali very easy to make and healthy
Korrala Pongali

కొర్రలతో పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..

కొర్రలు, పెసర పప్పు – కప్పు చొప్పున, నెయ్యి – అర కప్పు, జీడిపప్పు – రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి – 5 లేదా 6, ఉప్పు – తగినంత, అల్లం తరుగు – టీస్పూన్‌, జీలకర్ర, మిరియాల పొడి – పావు టీస్పూన్‌ చొప్పున, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెబ్బలు.

కొర్రలతో పొంగలిని తయారు చేసే విధానం..

కొర్రలను ఆరు లేదా ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి. పొయ్యిపై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగిన తరువాత పెసరపపప్పు వేసి వేయించాలి. తరువాత మరో గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాత్రలోనే నానబెట్టిన కొర్రలను పోసి నీరంతా పోయే వరకు వేయించాలి. వీటిని రోట్లో వేసి దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెసరపప్పులో వేసి నీళ్లు పోసి అరగంటపాటు ఉడికించాలి. ఇప్పుడు మరో పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, మిరియాల పొడి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపును ఉడికించిన కొర్రల్లో కలపాలి. దీంతో ఎంతో రుచికరమైన కొర్రల పొంగలి తయారవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. కాస్త నెయ్యి వేసి కలిపి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దీని వల్ల మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు రెండూ లభిస్తాయి.

Editor

Recent Posts