ఓట్స్, కోడిగుడ్లు.. రెండూ మనకు అనేక పోషకాలను, శక్తిని అందిస్తాయి. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. ఓట్స్‌ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అలాగే కోడిగుడ్ల వల్ల మనకు ప్రోటీన్లు, పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే ఉదయాన్నే సాధారణ బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా ఓట్‌మీల్ ఆమ్లెట్‌ను తీసుకోవడం వల్ల శక్తి, పోషణ రెండింటినీ పొందవచ్చు. ఇక ఈ ఆమ్లెట్‌ను తయారు చేయడం కూడా తేలికే.
* కోడిగుడ్లు – 6 (ఎగ్ వైట్స్ 4, పచ్చ సొన 2)
* ఓట్స్ – 50 గ్రాములు
* ఆమ్లెట్ తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాలు (పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, ఇతర పదార్థాలు)
సాధారణ ఆమ్లెట్ వేసినట్లుగా ఓట్ మీల్ ఆమ్లెట్ వేయాలి. కాకపోతే అందులో ఓట్స్ కలపాల్సి ఉంటుంది. గుడ్లతోపాటు ఇతర ఆమ్లెట్ తయారీ పదార్థాలను వేసి అందులో ఓట్స్ కూడా వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమంతో ఆమ్లెట్‌లను వేసి తినవచ్చు. 2 లేదా 3 ఆమ్లెట్‌లను తింటే చాలు.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పూర్తవుతుంది. దీంతో శరీరానికి ప్రోటీన్లు, పోషణ లభిస్తాయి. శక్తి అందుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. బలవర్ధకమైన ఆహారాల జాబితా కిందకు ఓట్ మీల్ ఆమ్లెట్ వస్తుంది. కనుక దీన్ని తరచూ బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.