రోజుకు 1000 క్యాల‌రీల‌ను ఎలా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు ?

నిత్యం మ‌న శ‌రీరానికి సుమారుగా 1500 నుంచి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. కూర్చుని ప‌నిచేసే వారికి 1500 క్యాల‌రీలు స‌రిపోతాయి. శారీర‌క శ్ర‌మ చేసే వారికి అయితే 1800 నుంచి 2500 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. అయితే శారీర‌క శ్ర‌మ చేసేవారికి ఎలాగూ నిత్యం వ్యాయామం అవుతుంది. క‌నుక వారు క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డం గురించి దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కానీ కూర్చుని ప‌ని చేసేవారు క‌చ్చితంగా నిత్యం శారీర‌క శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి.

rojuku 1000 calories kharchu cheyadam ela

నిత్యం 1500 నుంచి 1800 క్యాల‌రీల ఆహారాన్ని మాత్ర‌మే తింటూ అందులో సుమారుగా 1000 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తే సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అయితే 1000 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ అందులో స‌గం వ‌ర‌కు.. అంటే సుమారుగా 500 వ‌ర‌కు క్యాల‌రీలు ఖ‌ర్చు చేసినా చాలు. దాంతో కూడా సుల‌భంగా, సేఫ్‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో నిత్యం 500 లేదా 1000 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయాలంటే ఏయే వ్యాయామాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* 50 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే సుమారుగా 1000 క్యాల‌రీలు ఖ‌ర్చవుతాయి. అదే 25 నుంచి 30 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల 500 వ‌ర‌కు క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

* 1 గంట సేపు జాగింగ్ చేస్తే సుమారుగా 1000 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. అదే అర గంట‌పాటు అయితే 500 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

* జిమ్‌లో బ్యాటిల్ రోప్స్‌తో గంట‌న్న‌ర పాటు సాధ‌న చేస్తే 1000 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. అందులో స‌గం టైం సాధ‌న చేస్తే 500 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

* 2 గంట‌ల పాటు సైకిల్ తొక్కితే 1000 క్యాల‌రీలు, 1 గంట పాటు సైకిల్ తొక్కితే 500 క్యాల‌రీలు ఖ‌ర్చవుతాయి.

* 3 గంట‌ల పాటు ప‌రుగులాంటి న‌డ‌క అయితే 1000 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. గంట‌న్న‌ర పాటు చేస్తే 500 క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి.

అలాగే మెట్లు ఎక్క‌డం వ‌ల్ల గంట‌కు 300 క్యాల‌రీలు, తేలిక‌పాటి స్విమ్మింగ్ చేయ‌డం వ‌ల్ల గంట‌కు 500 క్యాల‌రీలు, గంట సేపు యోగా చేస్తే 300 క్యాల‌రీలు, గంట సేపు బ‌రువులెత్తితే 300 క్యాల‌రీలు, జిమ్ సైకిల్‌‌పై గంట‌కు 400 క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts