శక్తివంతమైన మూలిక అతి మధురం.. దీంతో ఏయే అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో తెలుసా..?

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. అత్యంత శక్తివంతమైన మూలికల్లో అతి మధురం కూడా ఒకటి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. జీర్ణమండల సమస్యలు మొదలుకొని ఆయాసం, మలబద్దకం వంటి ఎన్నో సమస్యలకు అతి మధురం ఒక చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే అతి మధురం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

athi madhuram churnam upayogalu

అతి మధురం. పేరులోనే తీపి దాగి ఉన్న ఈ మూలికను అత్యంత శక్తివంతమైన మూలికగా ఆయుర్వేదం చెబుతోంది. రుచికి తియ్యగా ఉంటుంది కనుకనే దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది. ఇక దీన్ని పలు ఇతర పేర్లతోనూ పిలుస్తారు. మధుయష్టి, యష్టిమధు, మధూక తదితర పేర్లతో దీన్ని పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని లిక్కరైస్‌ అంటారు. హిందీలో ములేటి అంటారు. అతి మధురంకు చెందిన చూర్ణం మనకు బయట ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తుంది.

1. అతి మధురంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని అనేక ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్ల చూర్ణాన్ని వాడుతారు. అతి మధురం చూర్ణంలో వస చూర్ణం కలిపి పూటకు పావు టీస్పూన్‌ చొప్పున మూడు పూటలా తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో దగ్గు తగ్గుతుంది.

2. అతి మధురం, అశ్వగంధ, శొంఠి చూర్ణాలను సమానంగా కలిపి అర టీస్పూన్‌ నుంచి ఒక టీస్పూన్‌ మోతాదులో అరకప్పు పాలతో కలిపి సేవిస్తుంటే కీళ్లు, కండరాల నొప్పులు, శరీరంలో నీరసం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.

3. సోపు గింజల చూర్ణానికి రెట్టింపు మోతాదులో అతి మధురం, పటికబెల్లం కలిపి ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్‌ మోతాదులో అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే కడుపు ఉబ్బరం, దగ్గు, ఆయాసం, త్రేన్పులు తగ్గుతాయి.

4. అతి మధురం చూర్ణాన్ని మూడు పూటలా పూటకు ఒక టీస్పూన్‌ మోతాదులో అరకప్పు నీటిలో కలిపి సేవిస్తుంటే అధిక దాహం, వెక్కిళ్లు, నోటిపూత, కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.

5. అరకప్పు పాలలో అర టీస్పూన్‌ మోతాదులో అతి మధురం చూర్ణాన్ని కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.

6. బియ్యం కడుగు నీళ్లతో అతి మధురం చూర్ణాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో సేవించాలి. దీని వల్ల నోరు, ముక్కు తదితర భాగాలనుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. స్త్రీలలో రుతు సమయంలో రక్తస్రావం తగ్గుతుంది.

7. అతి మధుర చూర్ణంతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా మారుతాయి. పిప్పి పళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. చిగుళ్ల నుంచి రక్త స్రావం తగ్గుతుంది. నోట్లో ఉండే పుండ్లు, పొక్కులు తగ్గుతాయి. నోటి దుర్వాసన ఉండదు.

8. అతి మధుర చూర్ణం, ఎండు ద్రాక్షలను సమానంగా కలిపి దంచి ముద్ద చేసి రోజుకు రెండుసార్లు పూటకు 10 గ్రాముల చొప్పున చప్పరించి ఒక కప్పు పాలు సేవించాలి. దీంతో స్త్రీలలో నీరసం, ఆయాసం, అలసట, గుండె దడ, మలబద్ధకం తగ్గుతాయి. రుతురక్తం సక్రమంగా ఉంటుంది. ఆ సమయంలో రక్తస్రావం తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.

9. అతి మధురం, ఆకుపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఒక టీస్పూను మోతాదులో రోజుకు రెండుపూటలా అరకప్పు పాలతో కలిపి సేవించాలి. దీని వల్ల మానసిక వ్యాధులు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

10. అతి మధుర చూర్ణాన్ని గాయాలు, పుండ్లపై చల్లితే అవి త్వరగా మానుతాయి. తరచూ ఇలా చేస్తే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. అలాగే రక్తస్రావం కూడా తగ్గుతుంది. అతి మధురం, కరక్కాయ, తానికాయ, ఉసిరి కాయ చూర్ణాలను సమానంగా కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించాలి. దీంతో కంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు పెరుగుతుంది.

11. అతి మధురం, సరస్వతి ఆకు, అశ్వగంధ, పటిక బెల్లం చూర్ణాలను సమానంగా కలిపి రెండుపూటలా పావు టీస్పూను నుంచి ఒక టీస్పూను మోతాదులో అరకప్పు పాలతో సేవించాలి. దీని వల్ల మతి మరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

12. అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూను చూర్ణం, ఒక టీస్పూను పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజుకు ఒకటి రెండుసార్లు తాగాలి. దీంతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

సూచన: మధుమేహ వ్యాధిగ్రస్తులు అతి మధురం వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts