అలోవెరా.. లేదా అలోయి బార్బాడెన్సిస్.. దీన్నే కలబంద అంటారు. మందపాటి, చిన్న కాండం కలిగిన మొక్క. దీని ఆకులలో నీరు నిల్వ ఉంటుంది. చర్మ గాయాలకు చికిత్స చేయడానికి ఇది బాగా ప్రసిద్ది చెందింది. అయితే ఇది అనేక ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
1. కలబంద గుజ్జులో ఆరోగ్యకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. కలబంద చర్మ గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సౌందర్య, ఔషధ, ఆహార పరిశ్రమలు కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి ఆకులో నీటిని నిల్వ చేసే సన్నని కణజాలం ఉంటుంది. ఇది ఆకులను మందంగా చేస్తుంది. ఈ నీటితో నిండిన కణజాలాన్నే జెల్ అని అంటారు. దాంతోనే మనకు ప్రయోజనాలు కలుగుతాయి.
2. కలబంద గుజ్జులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. కలబంద గుజ్జు బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
3. కలబంద గుజ్జు యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. కలబంద గుజ్జులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
4. కలబంద గుజ్జు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఆ గుజ్జును రాస్తే గాయాలు, పుండ్లు తగ్గుతాయి. చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. మొటిమలు, మచ్చలు ఉండవు. చర్మం కాంతివంతంగా మారుతుంది. పలు ఫేస్ ప్యాక్లలోనూ కలబంద గుజ్జును ఉపయోగిస్తారు.
5. కలబంద గుజ్జు చర్మంపై ఏర్పడే దురదలు, ఎరుపుదనం, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది దంత క్షయం, చిగుళ్ళ వ్యాధులను తగ్గిస్తుంది. అందుకు గాను కలబంద గుజ్జును నీటిలో పోసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి. దీంతో నోట్లోని బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కలబంద గుజ్జులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్లే దీన్ని అనేక మౌత్ వాష్ల తయారీలోనూ ఉపయోగిస్తారు.
6. నోట్లో పుండ్లు, పొక్కులు, పూతలు ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తుంటే ఆయా సమస్యలు తగ్గుతాయి.
7. కలబంద రసాన్ని రోజూ పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
సూచన : కలబంద గుజ్జు లేదా రసం మంచిదే అయినప్పటికీ కొందరికి ఇది పడదు. రియాక్షన్ను కలిగిస్తుంది. అందువల్ల రియాక్షన్ కలిగితే కలబందను వాడకూడదు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365