Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మూలిక‌లు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

Admin by Admin
January 3, 2025
in మూలిక‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అశ్వగంధ.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కకు చెందిన వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ మనకు ఉపయోగపడతాయి. సాధారణంగా మనకు మార్కెట్‌లో అశ్వగంధ చూర్ణం లభిస్తుంది. దాన్ని ఆ మొక్క వేర్లను ఎండబెట్టి తయారు చేస్తారు. ఈ క్రమంలోనే అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 1 లేదా 2 టీస్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాస్ నీరు లేదా పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా నెయ్యి, తేనెలతోనూ దీన్ని తీసుకోవచ్చు. అశ్వగంథ పొడిని రోజూ సేవిస్తుంటే ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. మనస్సును ప్రశాంతంగా మార్చి ఆందోళనను తగ్గించే గుణాలు అశ్వగంధలో ఉంటాయి. అందువల్ల ఈ పొడిని నిత్యం తీసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మూడ్ మారుతుంది.

2. అశ్వగంధ పొడిని రోజూ తీసుకోవడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు నిద్రమాత్రలు మింగేకన్నా ఈ పొడిని తీసుకుంటే మేలు కలుగుతుంది.

kind of ayurveda ashwagandha

3. అశ్వగంధ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్యలు పోతాయి. వీర్యం వృద్ధి చెందుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4. అశ్వగంధ పొడి వల్ల మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

5. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం అశ్వగంధను తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా అశ్వగంధ వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

6. అశ్వగంధలో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపేస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే కండరాల వాపులు తగ్గుతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి.

7. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకనే అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయర్వేద (ఆయుర్వేద రారాజు) అని కూడా పిలుస్తున్నారు.

Tags: ashwagandha
Previous Post

కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ 5 వ్యాయామాలు చేయాలి..!

Next Post

Viral Photo : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!