Herbs For Hair : నేటి తరుణంలో జుట్టు సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పలుచబడడం, జుట్టు పెరగకపోవడం, చుండ్రు, తలలో దురద వంటి వాటిని జుట్టు సమస్యలుగా చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యల నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే హెయిర్ ప్రొడక్ట్స్ ను, షాంపులను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేకపోగా వీటిలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు సమస్యలు మరింత ఎక్కువవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడానికి బదులుగా సహజ సిద్దమైన కొన్ని మూలికలను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.
ఈ మూలికలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. వీటిని జుట్టు సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. జుట్టు సమస్యలను దూరం చేసి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేద మూలికలు ఏమిటి.. వీటిని వాడడం వల్ల మన జుట్టుకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు పెరుగుదలలో మనకు బ్రహ్మి ఎంతగానో సహయపడుతుంది. దీనిలో ఉండే ఆల్కలాయిడ్స్ జుట్టు పెరుగుదలలో దోహదపడతాయి. బ్రహ్మిని వాడడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగాపెరుగుతుంది. ఇక జుట్టు సంరక్షణలో ఉసిరికాయ ఎంతో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరిని జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఉసిరికాయను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో దోహదపడతాయి.
అలాగే తలలో దురద, చుండ్రు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు సమర్థవంతంగా పని చేస్తాయి. అలాగే ఈ ఆకులను వినియోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా రోజ్ మేరీని వాడడం వల్ల కూడా జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. దీనిని వాడడం వల్ల తెల్ల జుట్టు, చుండ్రు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక కలబందను వాడడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జుట్టు పెరుగుదలలో జింగో కూడా ఎంతో దోహదపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తసరఫరాను మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది. ఇక వంటల్లో వాడే పుదీనా కూడా మన జుట్టు ఆరోగ్యానికి దోహదపడుతుంది.
దీనిని వాడడం వల్ల జుట్టు రాలడం, తలలో ఇన్పెక్షన్ వంటి సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఇక జుట్టు కుదుళ్ల పొడి బారకుండా, మృదువుగా ఉంచడంలో, తలలో ఉండే బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో లావెండర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలగే జుట్టు చిట్లడం వంటి సమస్యలతో బాధపడే వారు జిన్సెంగ్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తసరఫరాను పెంచి జుట్టు కుదుళ్లను బలంగాఉంచడంలో కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఈ సహజసిద్దమైన మూలికలను వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది.