Ragi Thopa : రాగిపిండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనితో మనం రోటీ, చపాతీ, జావ, ఉప్మా వంటి వాటితో పాటు ఇతర వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. రాగిపిండితో చేసుకోదగిన వంటకాల్లో రాగి తోపా కూడా ఒకటి. దీనిని చాలా పురాతన కాలంలో తయారు చేసేవారు. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.దీనిని తినడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. స్త్రీల్లలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. నెలసరి సక్రమంగా వస్తుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగి తోఫాను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి తోఫాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి తోఫా తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – అర కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, రాగిపిండి – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రాగి తోఫా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బెల్లాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో నీటిని పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత రాగిపిండి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై చక్కగా వేయించిన తరువాత యాలకుల పొడి వేసికలపాలి. తరువాత వడకట్టిన బెల్లం మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని చిన్న మంటపై కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు ఉడికించిన తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి తోఫా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు రాగిపిండితో తోఫాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.