Betel Leaves : తమలపాకులను సహజంగానే చాలా మంది భోజనం చేశాక తాంబూలం రూపంలో వేసుకుంటుంటారు. కొందరు పొగాకు వంటివి వేసుకుని తింటారు. అలా తినడం ఎంత మాత్రం మంచిది కాదు. నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల తమలపాకులను నేరుగానే తినాలి. భోజనం చేశాక దీన్ని తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, మలబద్దకం ఉండవు. నోటి దుర్వాసన తగ్గుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం తమలపాకులను ఉపయోగించి మనకు ఏయే గృహ చికిత్సలు అందుబాటులో ఉన్నాయో.. వీటితో ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

1. తమలపాకుల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల వీటిని రోజుకు రెండు చొప్పున.. మధ్యాహ్నం, రాత్రి తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లను కట్టడి చేయవచ్చు.
2. ఏడు తమలపాకులను తీసుకుని కాస్తంత ఉప్పుతో కలిపి ముద్దగా నూరాలి. దీన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. దీంతో బోదకాలు తగ్గుతుంది.
3. ఒక తమలపాకును తీసుకుని అందులో అర టీస్పూన్ మిరియాల పొడిని ఉంచి.. చుట్టి దాన్ని ఉదయాన్నే పరగడుపునే తినాలి. తరువాత 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోరాదు. ఇలా నెల రోజుల పాటు చేస్తే అధిక బరువు, పొట్ట తగ్గుతాయి.
4. అర టీస్పూన్ తమలపాకుల రసం, అంతే మోతాదులో తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని పిల్లలచేత నాకించాలి. దెబ్బకు జలుబు, దగ్గు తగ్గుతాయి.
5. చెవుల మీద తమలపాకులను ఉంచి కట్టులా కడితే.. తలనొప్పి తగ్గుతుంది. ఇలా ఒక గంట పాటు ఉంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. ఒక కప్పు గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తమలపాకుల రసం కలిపి తాగితే మహిళల్లో ఉండే క్షణికావేశం తగ్గుతుంది. పిచ్చిగా ప్రవర్తించేవారి మానసిక స్థితి మెరుగు పడుతుంది.
7. గుండె కొట్టుకోవడం సరిగ్గా లేనప్పుడు.. మరీ ఎక్కువ వేగంగా లేదా మరీ తక్కువ వేగంతో కొట్టుకుంటున్నప్పుడు.. ఒక తమలపాకును అలాగే నమిలి మింగేయాలి. దీంతో సమస్య వెంటనే తగ్గుతుంది.
8. తమలపాకుల రసాన్ని నిమ్మకాయ షర్బత్‌లో కలిపి తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కఫం పోతుంది.
9. పాలిచ్చే తల్లులకు కొన్ని సందర్భాల్లో స్తనాల్లో పాలు గడ్డలుగా కట్టి నొప్పులు వస్తాయి. ఇందుకు గాను తమలపాకులను కొద్దిగా వేడి చేసి స్తనాలపై వేసి కట్టులా కట్టాలి. దీంతో సమస్య తగ్గుతుంది.
10. తమలపాకులను వేడి చేసి వాటిపై ఆముదం రాయాలి. అనంతరం ఆ ఆకులను ఛాతిపై వేయాలి. దీంతో పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు తదితర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
11. అతి మధురం చూర్ణం ఒక టీస్పూన్, తమలపాకుల రసం ఒక టీస్పూన్, తేనె ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని కలిపి రోజుకు రెండు పూటలా సేవిస్తుంటే.. పెద్దల్లో వచ్చే మొండి జలుబు సైతం తగ్గిపోతుంది.
12. తమలపాకుల కాండాన్ని సేకరించి బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ మింగాలి. దీంతో కంఠ స్వరం మెరుగు పడుతుంది.
13. తమలపాకు తొడిమ రసం, తేనెలను కలిపి పిల్లలకు ఇస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి.
14. తమలపాకులను రోజుకు రెండు సార్లు ఒక్కో ఆకు చొప్పున భోజనం చేశాక నమిలితే తిన్న ఆహారం జీర్ణమవుతుంది. గ్యాస్ ఉండదు. అలాగే శరీరంలో ఉండే కఫం కరిగిపోతుంది. తీవ్రమైన దప్పిక తగ్గుతుంది.
15. తమలపాకులను రోజుకు రెండు నమలడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.