కర్పూరం. దీన్నే Cinnamomum Camphor అని సైంటిఫిక్ భాషలో పిలుస్తారు. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తెలుపు రంగులో పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్ని వెలిగిస్తే వచ్చే పొగ సువాసనను అందిస్తుంది. Cinnamonun camphora అనే చెట్టు బెరడు నుంచి కర్పూరాన్ని తయారు చేస్తారు. 50 ఏళ్లకు పైబడిన ఆ చెట్ల నుంచి జిగురు లాంటి పదార్థాన్ని సేకరించి కర్పూరం నూనెను తయారు చేస్తారు. ఈ చెట్లు జపాన్, ఇండోనేషియా, ఆసియాలోని పలు ఇతర దేశాల్లో పెరుగుతాయి. కర్పూరాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీంతో పలు రకాల ఔషధాలను తయారు చేస్తారు. వేపర్ రబ్స్, బామ్‌లు, లినిమెంట్స్‌లో కర్పూరాన్ని వాడుతారు. కర్పూరం నూనె నొప్పిని, దురదలను తగ్గిస్తుంది.
ఇంట్లో బొద్దింకలు, పురుగులు రాకుండా ఉండేందుకు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. హిందువులు కర్పూరాన్ని పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. కర్పూరం చర్మం, వెంట్రుకలకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది.
1. కర్పూరం నూనెను నొప్పులు, వాపులు తగ్గించేందుకు వాడవచ్చు. కొద్దిగా నూనెను తీసుకుని నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కొందరికి చర్మం ఎర్రగా మారి దురద పెడుతుంది. అలాంటి వారు కర్పూరాన్ని ఉపయోగించాలి. దీంతో దద్దుర్లు, దురదలు, ఎర్రగా మారడం తగ్గుతాయి. కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొద్దిగా కర్పూరం నూనెను వేసి ఆ మిశ్రమాన్ని ఇబ్బంది ఉన్న భాగంలో రాయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
3. ఫంగస్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించేందుకు కర్పూరం నూనె పనిచేస్తుంది. ఫంగస్ ఉన్న ప్రదేశంలో ఆ నూనెను రాయాలి. రోజూ ఇలా చేస్తే ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
4. చిన్నారులు, పెద్దల్లో వచ్చే గజ్జిని తగ్గించేందుకు కర్పూరం పనిచేస్తుంది. దీంతోపాటు నొప్పి, వాపు తగ్గుతాయి. అనేక లోషన్లు, ఆయింట్‌మెంట్ల తయారీలో కర్పూరాన్ని వాడుతారు.
5. నిద్ర చక్కగా పట్టేందుకు, నిద్రలేమి సమస్య నుంచి బయట పడేందుకు కర్పూరం పనిచేస్తుంది. నిద్రించేందుకు ఉపయోగించే దిండుపై కొన్ని చుక్కల కర్పూరం ఆయిల్‌ను వేయాలి. ఆ వాసన పీలిస్తే నిద్ర బాగా పడుతుంది.
6. కర్పూరాన్ని వాడడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. కర్పూరం నూనెను ఛాతి భాగంలో, వెనుక భాగంలో మర్దనా చేయాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కర్పూరం నూనె సహాయ పడుతుంది. కర్పూరం నూనెను కొద్దిగా తీసుకుని దాన్ని ఇతర హెయిర్ ఆయిల్‌లో కలిపి రోజూ రాసుకోవాలి. దీంతో తలలో రక్త సరఫరా పెరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.
8. కర్పూరం పొడి, కొబ్బరినూనెలను కొద్దిగా తీసుకుని రెండింటినీ కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. దీంతో చుండ్ర సమస్య తగ్గుతుంది. పేలు పడిపోతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365