బ్లాక్‌ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ?

భారతీయుల ఆహారంలో బియ్యం ముఖ్య పాత్రను పోషిస్తాయి. చాలా మంది అన్నంను రోజూ తింటుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అన్నం ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే భిన్న రకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ స్థోమతకు తగినట్లుగా బియ్యాన్ని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే బియ్యంలో వివిధ రకాల రంగుల బియ్యం ఉన్నాయి. వాటిల్లో బ్లాక్‌ రైస్‌ ఒకటి.

బ్లాక్‌ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ?

నల్ల రంగు బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ బియ్యంలో పోషకాలు ఎక్కువ. అందువల్ల బ్లాక్‌ రైస్‌ను తింటే అనేక లాభాలు పొందవచ్చు.

బ్లాక్‌ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు సురక్షితంగా ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి. డయాబెటిస్‌ రాకుండా అడ్డుకోవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి నల్ల బియ్యం వరమనే చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.

బ్లాక్‌ రైస్‌ను తింటే కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కళ్ల చూపు బాగు పడుతుంది. కంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

డయాబెటిస్‌ ఉన్నవారు బ్లాక్‌ రైస్‌ను తింటే షుగర్‌ లెవల్స్‌ ను అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అధిక బరువు సమస్య ఉన్నవారు రోజూ బ్లాక్‌ రైస్‌ను తింటుంటే ఫలితం ఉంటుంది.

Share
Admin

Recent Posts