Aloe Vera Gel For Hair Growth : మీరు వాడే షాంపూలో ఇది క‌లిపి జుట్టుకు రాయండి.. ఊహించ‌లేనంత పొడ‌వు పెరుగుతుంది..

Aloe Vera Gel For Hair Growth : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు రాల‌డం, జుట్టు చివ‌ర్లు తెగిపోవ‌డం, జుట్టు పొడిబార‌డం, చుండ్రు వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత సమ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం ఒక చిట్కాను వాడ‌డం వల్ల త‌గ్గించుకోవ‌చ్చు.

ఈ చిట్కాను త‌యారు చేయ‌డానికి ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. క‌ల‌బంద మ‌న జుట్టు ఎదుగుద‌ల‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ల‌పై దెబ్బ‌తిన్న క‌ణాల‌ను బాగు చేసి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరిగేలా చేయ‌డంలో క‌ల‌బంద దోహ‌ద‌ప‌డుతుంది. దీనిలో ఉండే యాంటీ ఫంగ‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు చుండ్రును తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. త‌రువాత ఈ క‌ల‌బంద గుజ్జులో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే షాంపును రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో వేసి క‌లుపుకోవాలి. త‌రువాత దీనిలో ఒక గ్లాస్ బియ్యం క‌డిగిన నీటిని పోసి 2 నిమిషాల పాటు బాగా క‌ల‌పాలి. జుట్టు ఎదుగుద‌ల‌లో బియ్యం క‌డిగిన నీరు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Aloe Vera Gel For Hair Growth use regularly for better results
Aloe Vera Gel For Hair Growth

ఈ నీటిలో ఉండే పోష‌కాలు జుట్టు రాల‌డాన్ని, జుట్టు పొడిబార‌డాన్ని త‌గ్గించి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. బియ్యం క‌డిగిన నీటిని వాడ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. ఇలా త‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని జుట్టంత‌టికి ప‌ట్టించి అర గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఎప్పుడూ చేసే విధంగా సాధార‌ణ నీటితో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్ల బ‌లంగా త‌యారయ్యి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఈ చిట్కా త‌యారీలో ఎటువంటి షాంపునైనా ఉప‌యోగించ‌వ‌చ్చు. జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు పొడి బార‌డం, జుట్టు తెగ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా, అందంగా త‌యార‌వుతుంది.

D

Recent Posts