Aloo Matar Masala : ప‌చ్చి బ‌ఠాణీలు, ఆలుతో.. మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే ఒక చ‌పాతీ ఎక్కువే తింటారు..

Aloo Matar Masala : బంగాళాదుంప‌ల‌ను మ‌నం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. చ‌ర్మాన్ని కాపాడ‌డంలో కూడా బంగాళాదుంప మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బంగాళాదుంప‌లతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా బంగాళాదుంప‌ల‌తో ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బంగాళాదుంప‌లు – 150 గ్రా., ప‌చ్చి బఠానీ – 100 గ్రా., ప‌సుపు – అర‌ టీ స్పూన్, నూనె – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, పెద్ద ట‌మాటాలు – 2, నీళ్లు – 350 ఎమ్ ఎల్, నెయ్యి – 2 టీ స్పూన్స్.

Aloo Matar Masala recipe in telugu perfect curry for chapati
Aloo Matar Masala

ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేసి వాటిని ముక్క‌లుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బ‌ఠాణీల‌ను వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఇందులోనే పావు టీస్పూన్ ప‌సుపును వేసి మెత్త‌గా ఉడికించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌లు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత ఇందులో అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, గ‌రం మసాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీ గా చేసి వేసుకుని క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి.

త‌రువాత ఇందులో నీళ్లు పోసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత నాలుగు లేదా ఐదు బంగాళాదుంప ముక్క‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప ముక్క‌ల‌ను, ప‌చ్చి బ‌ఠాణీల‌ను వేసి క‌లుపుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌ఠాణీ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర త‌యారీలో ఎండు బ‌ఠాణీల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే ఈ బ‌ఠాణీల‌ను ఒక రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఈ విధంగా చేసిన ఆలూ బ‌ఠాణీ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts