Constipation : మ‌ల‌బ‌ద్ద‌కాన్ని జాడిచ్చి త‌న్నే సూప‌ర్ చిట్కా..!

Constipation : ప్ర‌స్తుత ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒకటి. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తలెత్త‌త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, నీళ్లు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, స‌మ‌యానికి త‌గినంత ఆహారం తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా నిత్యం కోపం, చిరాకు, మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతుంటారు. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. చాలా మంది ఇత‌రుల‌తో ఈ స‌మ‌స్య గురించి చ‌ర్చించ‌డానికి ఇబ్బంది ప‌డుతుంటారు.

స‌హ‌జ సిద్ద ప‌ద్ద‌తుల్లో కూడా మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి మ‌నం బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌నం రోజూ తీసుకునే ఆహారంలో పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. పీచు ప‌దార్థాలు మ‌ల‌విస‌ర్జ‌న సాఫీగా అయ్యేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు నిమ్మ‌ర‌సాన్ని లేదా బ‌త్తాయి ర‌సాన్ని తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌డంలో ఆలివ్ నూనె ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. రోజూ ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ నీళ్ల‌ల్లో ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెను, ఒక టీ స్పూన్ నిమ్మ‌రసాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇలా ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి శాశ్వ‌త ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

amazing home remedies for Constipation very effective
Constipation

రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌ల్లో ఒక టీ స్పూన్ నెయ్యిని క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌ల‌విస‌ర్జ‌న సాఫీగా సాగుతుంది. మ‌న వంటింట్లో వాడే మ‌సాలా దినుసుల్లో యాల‌కులు కూడా ఒక‌టి. యాల‌కుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు ప‌దార్థాలు జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. అలాగే ప్ర‌తిరోజూ ఉద‌యం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిటికెడు ప‌సుపు, ఒక టీ స్పూన్ యాల‌కుల పొడిని క‌లిపి తీసుకుంటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగుతుంది.

రెండు రోజుల పాటు రోజూ రెండు యాల‌కుల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల కూడా మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే రోజూ మొత్తంలో మూడు నుండి నాలుగు లీట‌ర్ల నీటిని తాగాలి. నీరు శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గించ‌డానికి బాగా ప‌ని చేస్తుంది. అదే విధంగా రోజూ ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ప‌సుపును వేసి క‌లిపి తాగినా కూడా మ‌ల‌బ‌ద్ద‌కం నివారించ‌బ‌డుతుంది. ఈ చిట్కాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

D

Recent Posts