Arthritis Pains : ఈ పండ్ల‌ను రోజూ తినండి.. ఎలాంటి కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!

Arthritis Pains : చాలా మందికి సీజ‌న‌ల్‌గా అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే వీట‌న్నింటినీ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను కూడా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. వీటికి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వల్ల చ‌లికాలంలో వ‌చ్చే ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక ఈ నొప్పులు త‌గ్గేందుకు తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పండ్ల‌లో బీటా కెరోటీన్‌, ఎంజైమ్‌లు, విట‌మిస్ సితోపాటు యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను చ‌లికాలంలో తీసుకుంటే నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారు చ‌లికాలంలో రోజూ బొప్పాయి పండ్ల‌ను తింటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో విట‌మిన్ సి అధికంగా ఉండే ద్రాక్ష‌, నిమ్మ‌, నారింజ‌, పైనాపిల్ వంటి పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. క‌నుక రోజూ వీటిని తింటున్నా కూడా ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

Arthritis Pains follow these wonderful remedies
Arthritis Pains

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, మల్‌బెర్రీ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హానిక‌ర ఫ్రీర్యాడిక‌ల్స్ బారి నుంచి శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి. క‌నుక ఈ పండ్ల‌ను రోజూ తింటున్నా కూడా ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే చెర్రీ పండ్ల‌లోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. వీటిల్లోనూ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల రోజూ గుప్పెడు చెర్రీ పండ్ల‌ను తింటే ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

యాపిల్ పండ్ల‌ను తిన్నా కూడా కీళ్ల నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ ఒక యాపిల్‌ను పొట్టు తీయ‌కుండానే తినాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి. అలాగే కివీ పండ్ల‌ను తింటున్నా ఆర్థ‌రైటిస్ నొప్పులు త‌గ్గుతాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఇలా ప‌లు ర‌కాల పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల ఈ కాలంలో వ‌చ్చే అన్ని ర‌కాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Editor

Recent Posts