Ayurvedic Remedies For Diabetes : షుగ‌ర్‌ను త‌గ్గించే ఆయుర్వేద చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Ayurvedic Remedies For Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌లు అంతా ఇంతా కాదు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలని చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులు వాడిన‌ప్ప‌టికి కొందరిలో షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉండ‌దు. అలాంటి వారు వారి కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఆయుర్వేదం ప్ర‌కారం మ‌నం తీసుకునే కొన్ని ఆహారాల్లో అలాగే ర‌కాల లోహాల్లో షుగ‌ర్ ను అదుపులో ఉంచే గుణం ఉంది.

వీటిని మ‌నం ఉప‌యోగించ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రావ‌డంతో పాటు షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు కూడా అదుపులో ఉంటాయి. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో ప‌సుపు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. మ‌నం రోజూ త‌యారు చేసే వంట‌ల్లో ప‌సుపును మ‌రింత ఎక్కువ‌గా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది. అలాగే రాత్రి పాత్ర‌లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే గుణం రాగి పాత్ర‌ల‌కు ఉంది. క‌నుక రాగి పాత్ర‌లో రాత్రంతా నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వల్ల క్ర‌మంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇక షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Ayurvedic Remedies For Diabetes simple ways to reduce blood sugar levels
Ayurvedic Remedies For Diabetes

రాత్రంతా నీటిలో నాన‌బెట్టిన మెంతుల‌ను తిని ఆ నీటిని తాగాలి. లేదంటే మొల‌కెత్తిన మెంతుల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. అలాగే నీటిలో మెంతి పిండి క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఇలా ఎలా తీసుకున్న కూడా షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు అల్లం టీని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఆయుర్వేదం ప్ర‌కారం శ‌రీరంలో వ్యాధుల‌ను త‌గ్గించే గుణం అల్లానికి ఉంది. వంట‌ల్లో అల్లాన్ని వాడ‌డంతో పాటు అల్లంతో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది. అలాగే మ‌నం వాడే మ‌సాలాలలో ఒక‌టైన దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. దాల్చిన చెక్క‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి.

అదే విధంగా కాక‌ర‌కాయ‌ల‌కు కూడా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచే గుణం ఉంది. క‌నుక వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే ఆహారంలో భాగంగా న‌ల్ల శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక నేరేడు పండ్ల‌ను వాటి ఆకుల‌ను న‌మిలి తిన్నా కూడా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే విధంగా ఉసిరికాయ జ్యూస్ ను లేదా ఉసిరికాయ‌ను ముక్క‌లుగా చేసి న‌మిలి తిన్నా కూడా షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts