వెన్ను నొప్పిని త‌గ్గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

ఒక‌ప్పుడంటే చాలా మంది నిత్యం శారీర‌క శ్ర‌మ చేసే వారు. కానీ ఇప్పుడు దాదాపుగా చాలా మంది నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల‌పై ప్రయాణం చేస్తున్నారు. అలాగే మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది. దీంతో వెన్ను నొప్పి కూడా చాలా మందిని బాధిస్తోంది. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే వెన్ను నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే…

back pain home remedies in telugu

* కొబ్బ‌రినూనెను కొద్దిగా తీసుకుని అందులో క‌ర్పూరం వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్లార్చాలి. దాన్ని సీసాలో నిల్వ చేసుకుని రోజూ వెన్నుపై మ‌ర్ద‌నా చేయాలి. దీంతో కొద్ది రోజుల్లోనే వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

* స్నానం చేసేందుకు వాడే గోరు వెచ్చ‌ని నీటిలో యూక‌లిప్ట‌స్ ఆయిల్ క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో కేవ‌లం వెన్ను నొప్పి మాత్ర‌మే కాదు, శ‌రీరంలో ఉండే ఇత‌ర నొప్పులు కూడా త‌గ్గుతాయి.

* స‌ముద్ర‌పు ఉప్పును వేడి చేసి దాన్ని ఒక వ‌స్త్రంలో చుట్టి దాంతో కాప‌డం పెడితే.. ఎంత‌టి నొప్పి అయినా ఇట్టే త‌గ్గిపోతుంది.

* ఆవ‌నూనెను కొద్దిగా వేడి చేసి దాంతో వెన్నుపై బాగా మ‌ర్ద‌నా చేయాలి. అనంత‌రం వేడినీటితో స్నానం చేయాలి. దీంతో వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

* ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు, కొంత తేనెల‌ను బాగా క‌లిపి రాత్రి నిద్రించ‌డానికి ముందు తాగితే ఎలాంటి నొప్పి అయినా త‌గ్గుతుంది.

* అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. అల్లంతో టీ చేసుకుని తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* హెర్బ‌ల్ ఆయిల్‌తో వెన్నుపై బాగా మ‌ర్ద‌నా చేసి అనంతరం వేడి నీటితో స్నానం చేయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది.

* బియ్యాన్ని కొద్దిగా వేడి చేసి వ‌స్త్రంలో చుట్టి దాంతో కాప‌డం పెట్టుకున్నా.. వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts