Beard Growth Tips : చాలా మంది యువకులు గడ్డం, మీసం సరిగ్గా పెరగక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొందరిలో అవి వచ్చినా కూడా పలుచగా ఉండి ఆత్మనూన్యత భావనకు గురి అవుతూ ఉంటారు. కొందరిలో గడ్డం అనేది రానే రాదు. ఈ సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. కారణాలు ఏవైనా ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి గడ్డం, మీసం సరిగ్గా పెరిగేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల తెల్లగా ఉన్న గడ్డం కూడా నల్లగా మారుతుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు వాడడం వల్ల గడ్డం ఒత్తుగా, గుబురుగా పెరుగుతుంది.
గడ్డం, మీసం ఒత్తుగా పెరిగేలా చేసే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకోవాలి. తరువాత ఈ గుజ్జులో ఒక విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేయాలి. తరువాత ఈ రెండింటిని ఒక నిమిషం పాటు బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత తడి లేకుండా ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీసం, గడ్డం ఉండే చోట చర్మం పై రాసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమం చర్మంలోకి ఇంకేలా మృదువుగా మర్దనా చేసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని గంటన్నర నుండి రెండు గంటల పాటు అలాగే ఉంచిన తరువాత చల్లటి నీటితో లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని మరో విధంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. ఇలా క్రమం తప్పకుండా వాడడం వల్ల గడ్డం, మీసం పెరుగుదలలో వచ్చే మార్పును గమనించవచ్చు. గడ్డం గుబురుగా, ఒత్తుగా పెరుగుతుంది. గడ్డం, మీసం పలుచగా ఉందని, పెరగడం లేదని బాధపడుతున్న యువకులు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.