Aloe Vera For Face : ముఖం అందంగా, తెల్లగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారణాల చేత చర్మం నల్లగా మారిపోతుంది. చర్మంపై మలినాలు, దుమ్ము ఎక్కువగా పేరుకుపోతున్నాయి. దీంతో ముఖం నల్లగా మారుతుంది. ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ముఖం అందవిహీనంగా, కాంతిహీనంగా కనిపిస్తుంది. ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే అనేక రకాల ఫేస్ట వాష్ లను వాడుతూ ఉంటారు. వీటికి బదులుగా ఇప్పుడు చెప్పే ఫేస్ ప్యాక్ ను వాడడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది.
దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు . అలాగే చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖానికి అందాన్ని, కాంతిని తీసుకు వచ్చే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పంచదారను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. దీనిని ఆరే వరకు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, దుమ్ము, మృతకణాలు తొలగిపోతాయి.
చర్మంపై నలుపు తొలగిపోతుంది. చర్మం తిరిగి సాధారణ రంగుకు వస్తుంది. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో వాడిన పంచదార స్క్రబర్ గా పని చేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. కలబంద చర్మానికి కావల్సిన పోషకాలను అందిస్తుంది. కాఫీ పౌడర్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఈ విధంగా ఈ పేస్ ప్యాక్ ను వాడడం వల్ల చర్మం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.