Nellore Chepala Pulusu : నెల్లూరు చేప‌ల పులుసు ఇలా చేయండి.. ఎవరికైనా స‌రే న‌చ్చి తీరుతుంది..!

Nellore Chepala Pulusu : నెల్లూరు చేప‌ల పులుసు.. ఈ పేరు విన‌ని వాళ్లు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. నెల్లూరు స్టైల్ లో మామిడికాయ ముక్క‌లు వేసి చేసేఈ చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ చేప‌ల పులుసును మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఇంట్లోనే నెల్లూరు స్టైల్ చేప‌ల పులుసును చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ నెల్లూరు చేప‌ల పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నెల్లూరు చేప‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – 2 కిలోలు, నూనె – 5 లేదా 6 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లిరెబ్బ‌లు – 10, పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 పెద్ద‌వి, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాటాలు – 2 పెద్ద‌వి, ప‌సుపు – ఒక టీ స్పూన్, కారం – 4 నుండి 5 టీ స్పూన్స్, ఉప్పు- త‌గినంత‌, నాన‌బెట్టిన చింత‌పండు – 150 గ్రా., నీళ్లు – త‌గిన‌న్ని, మామిడికాయ ముక్క‌లు – 4.

Nellore Chepala Pulusu recipe very tasty must take everybody
Nellore Chepala Pulusu

నెల్లూరు చేప‌ల పులుసు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, మెంతులు వేసివేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత చేప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. గంటెతో క‌ల‌ప‌కుండా క‌ళాయిని క‌దుపుతూ క‌లుపుకోవాలి. త‌రువాత చింత‌పండు పులుసు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మామిడికాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మామిడికాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డ వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నెల్లూరు చేప‌ల పులుసు త‌యార‌వుతుంది. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న చేప‌ల పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts