Hair Problems : కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోరు.. కానీ కలబంద గుజ్జు అద్భుతాలు చేస్తుంది. అనేక సమస్యలకు కలబంద పనిచేస్తుంది. అయితే జుట్టు సమస్యలైన జుట్టు రాలిపోవడం, చుండ్రు, శిరోజాలు చిట్లిపోవడం, కాంతిహీనంగా మారడం.. వంటి అన్ని సమస్యలకు కలబంద ఒక్కటే గుజ్జు చక్కగా పనిచేస్తుంది. కాకపోతే అందులో భిన్న రకాల పదార్థాలను కలిపి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. మరి జుట్టు సమస్యలను తగ్గించుకునేందుకు కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. జుట్టు రాలే సమస్య ఉన్నవారు కలబంద గుజ్జులో ఆముదం, కోడిగుడ్డు ఒకటి కలిపి బాగా మిక్స్ చేసి దాన్ని జుట్టుకు రాయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే చాలు.. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది.
2. కలబంద గుజ్జులో కొబ్బరినూనె, నిమ్మరసం కొద్ది కొద్దిగా కలిపి జుట్టుకు రాయాలి. అర గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయవచ్చు. దీంతో చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టులో దురద తగ్గుతుంది.
3. కలబంద గుజ్జులో తేనె, పొద్దు తిరుగుడు విత్తనాల నూనెలను కొద్దిగా కలిపి తలకు బాగా రాయాలి. గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే శిరోజాలు చిట్లిపోవడం తగ్గుతుంది. వెంట్రుకలు అందంగా, కాంతివంతంగా మారుతాయి. వారంలో ఇలా రెండు సార్లు చేయవచ్చు.
4. జుట్టుకు పోషణ లేక అందవిహీనంగా కనిపిస్తుంటే.. కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు, తేనె కలిపి రాయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
5. శిరోజాలు బాగా చిక్కుపడుతుంటే.. కలబంద గుజ్జులో కొద్దిగా కొబ్బరినూనె, డిస్టిల్డ్ వాటర్ కలిపి రాసి గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే సమస్య నుంచి బయట పడవచ్చు.