అందానికి చిట్కాలు

Beauty Tips : ఈ విధంగా చేస్తే.. ముఖంపై ఉండే నలుపు మొత్తం పోతుంది..!

Beauty Tips : అందంగా కనిపించాలని ఎవరనుకోరు చెప్పండి. అందంగా కనిపించడం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు సహజ ఉత్పత్తులను ఉపయోగించడం, మరికొందరు మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ వారి అందాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా మంది ముఖంపై ఏర్పడిన ట్యాన్ (నలుపు రంగు) తో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ ట్యాన్ తొలగిపోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఒక టమాటాను మధ్యలోకి కట్ చేసి ఆ ముక్కను పంచదారలో అద్ది అనంతరం ఆ టమాటా ముక్కపై పెరుగు వేసి ముఖంపై బాగా రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల ముఖం పై ఏర్పడిన మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ట్యాన్ కూడా తొలగిపోతుంది. ముఖం తిరిగి పూర్వ రంగును పొందుతుంది.

beauty tips follow these for skin health

ఒక టమాటా రసం, ఒక నిమ్మకాయ రసం, కొద్దిగా పెరుగు కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం పలచగా ఉందనుకుంటే కాస్త శనగపిండి వేసుకొని మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపైన రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు వేయడం వల్ల నలుపు రంగు తొలగిపోతుంది.

ఒక టమాటా రసానికి, ఒక చెంచా నిమ్మరసం కలిపి అందులో కొద్దిగా ముల్తాని మట్టి వేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం ఎంతో తాజాగా ఉండటమే కాకుండా ముఖంపై ఏర్పడిన ట్యాన్ పోయి చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. చర్మం తెల్లగా మారుతుంది. ఈ విధంగా టమాటాలతో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.

Share
Admin

Recent Posts