Beauty Tips : ముఖం అందంగా కనబడాలని మనలో చాలా మంది కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఇతర అనారోగ్యాల కారణంగా ముఖంపై మచ్చలు, మొటిమలు, కురుపులు, ముఖం జిడ్డుగా మారడం వంటివి జరుగుతున్నాయి. వీటి కారణంగా ముఖం కాంతిని కోల్పోయి అందవిహీనంగా నల్లగా మారుతోంది. ఈ సమస్యలు తగ్గి ముఖం అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల క్రీములను,పేస్ వాష్, ఫేస్ ప్యాక్ లను వాడుతుంటారు. వీటి వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.
వీటిని ఎక్కువగా ఉపయోగించడం కూడా అంత మంచిది కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఎటువంటి ఖర్చు, శ్రమ లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే వాటితోనే మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. చర్మ సమస్యలు తగ్గి ముఖం అందంగా కనబడడానికి పాటించాల్సిన ఇంటి చిట్కా ఏమిటి.. దీనిని ఏవిధంగా పాటించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ పసుపును వేయాలి. తరువాత తగినన్ని పచ్చి పాలను తీసుకుని వాటిని పసుపుతో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను ముఖానికి బాగా పట్టించి బాగా ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా కడిగిన గంట తరువాత సబ్బుతో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. పసుపు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక దీనిని వాడడం వల్ల చర్మంపై ఉండే బాక్టీరియా, వైరస్ లు నశించి మొటిమలు, కురుపుల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల ముఖంపై ఉండే నలుపుదనం, జిడ్డు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.