Beauty Tips : అందంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తుంటారు కూడా. చర్మ సమస్యలు తొలగిపోయి చర్మం అందంగా, కాంతివంతంగా కనబడాలని మార్కెట్ లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడం, బ్యూటీ పార్లర్ కు వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక విసుగు చెందిన వారు కూడా మనలో ఉండే ఉంటారు. ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి వాటితో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల సమస్యలు తగ్గి ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వారానికి ఒకసారి వాడడం వల్ల పార్లర్ కు వెళ్లే అవసరం లేకుండానే ముఖం కాంతివంతగా మెరిసిపోతుంది.
అందాన్ని మెరుగుపరిచే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి.. వంటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమలు, మచ్చలతో ముఖం అందవిహీనంగా మారిన వారు ఈ చిట్కాను పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్ తయారీలో అన్నీ కూడా మనం సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తూ ఉన్నాం. కనుక ఎటువంటి దుష్ప్రభావాల బారిన కూడా పడకుంటాం. ముఖ అందాన్ని మెరుగుపరిచే ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గాను మనం ఒకటి లేదా రెండు టీ స్పూన్ల శనగపిండిని, అర టీ స్పూన్ కస్తూరి పసుపును, రెండు టీ స్పూన్ల బంగాళాదుంప రసాన్ని, రెండు టీ స్పూన్ల గులాబీ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని, పసుపును వేసి బాగా కలపాలి. తరువాత బంగాళాదుంప రసం, గులాబీ నీరు వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ, బ్రష్ తో కానీ తీసుకుంటూ ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా రాసిన 15 నుండి 20 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. తరువాత మెత్తగా ఉండే టవల్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ఎండ వల్ల వచ్చే నలుపుదనం, ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇలా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడి ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.