అందానికి చిట్కాలు

Dark Neck And Armpits : శ‌రీరంపై ఎక్క‌డ న‌లుపు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే పోతుంది..!

Dark Neck And Armpits : నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట.. ఇలా కారణాలు ఏమున్నా శరీరంలోని ఆయా భాగాలు నల్లగా మారుతుంటాయి. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, మెడ‌, చంకల్లో ఎక్కువగా నల్లగా అవుతుంది. అయితే కింద సూచించిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి తిరిగి పూర్వ స్థితిని ఇవ్వడంలో అలోవెరా జెల్ (కలబంద గుజ్జు) బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని నల్లబడ్డ ప్రదేశాలపై రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే చక్కని ఫలితాలు వస్తాయి.

ఒక భాగం నీరు, 3 భాగాల బేకింగ్ సోడాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. మిశ్రమం స్మూత్‌గా వచ్చే వరకు పేస్ట్‌ను బాగా కలపాలి. దీన్ని నల్లబడ్డ భాగాలపై రోజుకు రెండు సార్లు రాస్తే ఫలితం ఉంటుంది. చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును కలిగించే గుణాలు నిమ్మలో అధికంగా ఉన్నాయి. కొద్దిగా నిమ్మ రసాన్ని తీసుకుని నల్లబడ్డ ప్రదేశంలో రాయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది. పొడిగా ఉన్న చర్మం, మృత చర్మ కణాలను తొలగించడంలో చక్కెర ఉపయోగపడితే చర్మాన్ని సంరక్షించడంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కొద్దిగా చక్కెర, ఆలివ్ ఆయిల్‌లను సమభాగాలుగా తీసుకుని రెండింటినీ పేస్ట్‌లా వచ్చే వరకు బాగా కలపాలి. అనంతరం ఆ పేస్ట్‌ను శరీర భాగాలపై రాసి 5 నుంచి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి.

dark neck and armpits home remedies dark neck and armpits home remedies

కీరదోసకాయ ముక్కలు కొన్ని, కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలిపి మిక్సీలో వేసి పట్టాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడ్డ భాగాల్లో ఉంచితే తగిన ఫలితం కనిపిస్తుంది. పాలు, దాని సంబంధ ఉత్పత్తుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొద్దిగా పాలు, పెరుగులను తీసుకుని మిశ్రమంగా కలిపి చర్మంపై రాయాలి. ఇది పొడి చర్మం కలవారికి మేలు చేస్తుంది. చర్మానికి పోషణను అందించే గుణాలు బాదం నూనెలో ఉన్నాయి. రోజుకోసారి బాదం నూనెను కొద్దిగా తీసుకుని చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది. చర్మానికి మెరుపును ఇచ్చే గుణం బాదం నూనెలో ఉంది. కొద్దిగా నీటిని, కొన్ని ఆలుగడ్డలను తీసుకుని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర భాగాలపై రాయాలి. కొద్దిసేపు ఆగాక కడిగేయాలి. ఇది మృత చర్మ కణాలను వేగంగా తొలగిస్తుంది. దీంతో చ‌ర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది.

Admin

Recent Posts