Hair Growth : వీటిని కలిపి వాడితే.. జుట్టు రాలదు.. వద్దన్నా కూడా నల్లగా, ఒత్తుగా, పొడవుగా జుట్టు పెరుగుతుంది..!

Hair Growth : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక రకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లిపోవడం, చుండ్రు వంటి అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయితే ఇందుకు మార్కెట్‌లో దొరికే షాంపూలను, క్రీములను వాడాల్సిన పనిలేదు. ఇవి జుట్టుకు మేలు చేయకపోగా.. హానిని కలగజేస్తాయి. కనుక వీటికి బదులుగా మనకు సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే మనం ఒక నూనెను తయారు చేసుకుని దాన్ని వాడవచ్చు. దీంతో ఎలాంటి జుట్టు సమస్య అయినా సరే తగ్గుతుంది. ఇక ఆ నూనెను ఎలా తయారు చేయాలంటే..

ఒక మిక్సీ జార్‌ను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల మెంతులను వేయాలి. తరువాత అందులోనే ఒకటిన్నర టీస్పూన్ల కలోంజి విత్తనాలు (బ్లాక్‌ సీడ్స్) వేయాలి. వీటిని మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడిని ఇంకో చిన్న బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో 20 ఎంఎల్‌ మోతాదులో ఆవనూనె లేదా కొబ్బరినూనె కలపాలి. ఇక ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. అయితే దీన్ని నేరుగా వేడిచేయకూడదు. ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ నీటిలో ముందుగా సిద్ధం చేసుకున్న నూనె గిన్నెను ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో ఉండే నూనె మరుగుతుంది. తరువాత ఆ నూనెలో నురుగు వచ్చేంత వరకు వేడి చేయాలి. అనంతరం స్టవ్‌ ఆఫ్‌ చేసి ఆ నూనెను 3 నుంచి 4 గంటల పాటు అలాగే ఉంచాలి. దీంతో నూనె రెడీ అవుతుంది. తరువాత దాన్ని వడబోసి ఒక గాజు సీసాలో నిల్వ చేయాలి.

follow this simple remedy for Hair Growth
Hair Growth

ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టుకు బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు పట్టించి నూనెను బాగా రాసిన తరువాత ఒక గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయాలి. దీంతో ఎలాంటి జుట్టు సమస్య అయినా సరే తగ్గుతుంది. ముఖ్యంగా జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు దృఢంగా మారుతుంది. ఈ ఆయిల్‌ వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రావు.

Share
Editor

Recent Posts