Blackheads : ప్రస్తుత కాలంలో స్త్రీ, పురుషుడు అనే సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి సాధారణమైన చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య కూడా ఒకటి. మన చర్మంపై ఉండే మృతకణాలు వాతావరణంలోని దుమ్ము ధూళితో కలిసి పోయి బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ లా మారిపోతాయి. ఇవి ఎక్కువగా ముక్కు, బుగ్గలు, నుదుటి మీద ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కొందరిలో ఇవి మెడ, వీపు, భుజాలు వంటి ఇతర శరీర భాగాల్లో కూడా వస్తాయి.
వీటిని తొలగించడానికి మార్కెట్ లో అనేక రకాల ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. కానీ అవి రసాయనాలతో, అధిక ధరలతో కూడుకున్నవి. ఇంటి చిట్కాను ఉపయోగించి కూడా మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి చాలా సులువుగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా కూడా పని చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యతో బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ టీ పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి.
తరువాత అర చెక్క నిమ్మకాయను తీసుకుని అందులో నిమ్మ రసాన్ని పిండి నిమ్మ చెక్కను పక్కకు ఉంచాలి. తరువాత టీ పొడి, నిమ్మరసం కలిసేలా కలపాలి. ఈ చిట్కాను వాడడానికి ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి లేదా 5 నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టాలి. తరువాత పక్కకు ఉంచిన నిమ్మచెక్కతో టీ పొడి మిశ్రమాన్ని తీసుకుంటూ బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో 5 నిమిషాల పాటు వృత్తాకారంలో రుద్దాలి.
ఇలా రుద్దిన తరువాత ఈ మిశ్రమాన్ని ముఖంపై 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య నుండి మనం బయటపడవచ్చు. ఈ చిన్న చిట్కాను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చులో అలాగే చాలా తక్కువ సమయంలో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య నుండి మనం బయటపడవచ్చు.