Face Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఉండే ఎంత‌టి న‌లుపు అయినా స‌రే పోతుంది..!

Face Beauty : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. పార్ల‌ర్ కు వెళ్లి ర‌క‌ర‌కాల ఫ్యాక్ ల‌ను వేసుకుంటూ ఉంటారు. వాటిలో గోల్డెన్ ఫేస్ ప్యాక్ కూడా ఒక‌టి. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఖ‌రీదుతో కూడుకుని ఉంటుంది. అయితే దీనిని ముఖానికి వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది. అయితే అంద‌రూ దీనిని ఉప‌యోగించ‌లేరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం మ‌న ముఖాన్ని అందంగా, తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ముఖాన్ని తెల్ల‌గా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం.. స్వీట్ బాదం నూనెను, ఎసెన్షియ‌ల్ ఆయిల్ ను, అలోవెరా జెల్ ను, ఒక గోల్డ్ పేప‌ర్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ స్వీట్ బాదం నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. బాదం నూనె అందుబాటులో లేని వారు ఆలివ్ నూనెను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. త‌రువాత ఇందులో రెండు చుక్క‌ల ఎసెన్షియ‌ల్ నూనెను, అలాగే 2 టీ స్పూన్ల అలోవెరా జెల్ ను వేసి క‌ల‌పాలి. మ‌న‌కు మార్కెట్ ల‌భించే అలోవెరా జెల్ ను ఉప‌యోగించ‌డం మంచిది. త‌రువాత ఇందులో ఒక గోల్డ్ పేప‌ర్ ను వేసి క‌ల‌పాలి. గోల్డ్ పేప‌ర్ మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తుంది.

follow this wonderful remedy for Face Beauty
Face Beauty

ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈమిశ్ర‌మాన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు రెండు లేదా ముక్క‌లు చుక్క‌ల మోతాదులో తీసుకుని ముఖానికి , మెడ‌కు రాసుకోవాలి. త‌రువాత రెండు నుండి మూడునిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయాలి. ఇలా నెల రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌లుపు, ట్యాన్ తొల‌గిపోయి ముఖం అందంగా , కాంతివంతంగా త‌యార‌వుతుంది.

D

Recent Posts