Chethi Chekkalu : చేతి చెక్క‌లు ఇలా చేస్తే.. గుల్ల‌గా క‌ర‌క‌ర‌లాడుతూ వ‌స్తాయి..!

Chethi Chekkalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం సుల‌భంగా బియ్యం పిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో చేతి చెక్క‌లు కూడా ఒక‌టి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇత‌రుల అవ‌స‌రం లేకుండా ఒక్క‌రైనా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే వీటిని తయారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చేతి చెక్క‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చేతి చెక్క‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – 2 క‌ప్పులు, మైదాపిండి – పావు క‌ప్పు, నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్.

Chethi Chekkalu recipe in telugu make in this way
Chethi Chekkalu

చేతి చెక్క‌ల త‌యారీ విధానం..

ముందుగా అల్లాన్ని, ప‌చ్చిమిర్చిని క‌లిపి మెత్త‌గా దంచుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మైదా, క‌రివేపాకు, అల్లం ప‌చ్చిమిర్చి పేస్ట్, శ‌న‌గ‌ప‌ప్పు, పుదీనా, ఉప్పు వేసుకోవాలి. త‌రువాత బ‌ట‌ర్ ను క‌రిగించి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత దీనిలో నీటిని పోస్తూ పిండిని క‌లుపుకోవాలి. పిండి మ‌రీ మెత్త‌గా, మరీ గ‌ట్టిగా కాకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత పిండిని చేత్తో ప‌ట్టుకుని బొట‌న వేలుతో రిబ్బ‌న్ ప‌కోడి మాదిరి వ‌త్తుకోవాలి. త‌రువాత వీటిని నూనె రాసిన ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడైన త‌రువాత చెక్క‌ల‌ను వేసుకుని వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చేతి చెక్క‌లు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. స్నాక్స్ గా తిన‌డానికి ఈ చెక్క‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి.

D

Recent Posts