Egg Hair Pack : కురులు చక్కగా, ఒత్తుగా, బలంగా పెరగలంటే ఎలాంటి హెయిర్ ప్యాక్ వేసుకోవాలో అందులో ఏయే పోషకాలు ఉంటాయో చూద్దాం. ఇది జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు చాలా తక్కువ ఖర్చుతోనే ఈ ప్యాక్ ను ఇంట్లో వేసుకోవచ్చు. దీంతో మీ జుట్టుకు సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. అలాగే శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. ఇక ఆ ప్యాక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరినూనె మీ జుట్టుకు నిగారింపుతోపాటు మృదుత్వాన్ని అందిస్తుంది. కొబ్బరిలోని ప్రోటీన్లు కురులు రాలకుండా చేయడంతోపాటు అవి బలంగా, చక్కగా పెరగడానికి తోడ్పడుతాయి.
కేశాలను కాంతులీనేలా చేయడంలో ఆలివ్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పొడి జుట్టు ఉన్నవారు దీన్ని వాడితే చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. లావెండర్ ఆయిల్ జుట్టు త్వరగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సువాసనను అందిస్తుంది. గుడ్లలోని పోషకాలు జుట్టుకు రక్షణను ఇస్తాయి. పచ్చసొన వెంట్రుకలను మృదుత్వాన్ని ఇస్తే.. విటమిన్ ఎ, కె, బయోటిన్‌లు చక్కగా జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇక వీటిని ఉపయోగించి ప్యాక్‌ను ఇలా తయారు చేయాలి.
ఒక గిన్నెలో ఒక గుడ్డును కొట్టాలి. ఇందులో రెండు పెద్ద టీస్పూన్ల చొప్పున కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, పెద్ద చెంచా లావెండర్ నూన్ వేసి బాగా కలపాలి. దీన్ని మాడుకు పట్టించి 20 నిమిషాల పాటు ఆగి తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది.