Juices For Skin : ఈ ఒక్క జ్యూస్‌తో ఎప్ప‌టికీ త‌ర‌గ‌ని యంగ్ ఏజ్ మీ సొంతం.. 20ల‌లో మాదిరిగా క‌నిపిస్తారు..!

Juices For Skin : ప్ర‌స్తుత త‌రుణంలో అందం ప‌ట్ల చాలా మందికి శ్ర‌ద్ధ పెరిగింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ అందంగా క‌నిపించేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అయితే అందంగా క‌నిపించేందుకు పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి. వీటి వ‌ల్ల చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది. ముడ‌త‌లు త‌గ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విష‌యానికి వ‌స్తే.. మ‌న‌కు కొన్ని ర‌కాల జ్యూస్‌లు అందుకు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. కింద చెప్పిన జ్యూస్‌ల‌లో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. దాంతో నెల రోజుల్లోనే చెప్పుకోద‌గిన మార్పు క‌నిపిస్తుంది. యంగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. వ‌య‌స్సు ఎంత ఉన్నా స‌రే 20 ఏళ్ల మాదిరిగా ఉన్న‌ట్లుగా క‌నిపిస్తారు. ఇక ఆ జ్యూస్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌కూర‌, కీర‌దోస‌, గ్రీన్ యాపిల్‌, నిమ్మ‌కాయ‌, అల్లం. వీటిని క‌లిపి జ్యూస్‌ను త‌యారు చేసి రోజుకు ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కీర‌దోస చ‌ర్మానికి కావ‌ల్సిన తేమ‌ను అందిస్తుంది. నిమ్మ‌ర‌సం, అల్లం ర‌సం చ‌ర్మంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో చ‌ర్మ కాంతి పెరుగుతుంది. చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

Juices For Skin take one of these daily
Juices For Skin

క్యారెట్లు, నారింజ‌లు, కాస్త ప‌సుపు వేసి జ్యూస్ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. క్యారెట్ల‌లో ఉండే బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది చ‌ర్మాన్ని సంర‌క్షించి కాంతిని అందిస్తుంది. అలాగే నారింజ‌ల్లో ఉండే విట‌మిన్ సి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా చూస్తుంది. ప‌సుపులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది.

బీట్‌రూట్‌, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల‌తో జ్యూస్‌ను త‌యారు చేసి అందులో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌వ‌చ్చు. ఈ జ్యూస్ కూడా చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చ‌ర్మంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను పెంచుతుంది. చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది. అలాగే పుచ్చ‌కాయ‌, పుదీనా ఆకుల జ్యూస్ లేదా పైనాపిల్‌, కీర‌దోస క‌లిపి జ్యూస్ చేసి కూడా తాగ‌వ‌చ్చు. ఇలా ఈ జ్యూస్‌ల‌లో ఏదైనా ఒక్క‌దాన్ని రోజూ తాగ‌డం వ‌ల్ల నెల రోజుల్లోనే చెప్పుకోద‌గిన మార్పు క‌నిపిస్తుంది. ఎప్ప‌టికీ త‌ర‌గ‌ని యంగ్ ఏజ్ సొంతం అవుతుంది, చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.

Share
Editor

Recent Posts