Lemon For Beauty : 7 రోజుల్లో మీ ముఖం అందంగా మారాలంటే.. నిమ్మకాయతో ఇలాచేయండి..

Lemon For Beauty : ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. అందాన్ని మెరుగుప‌రిచే స‌బ్బుల‌ను, క్రీముల‌ను, ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్ ల‌ను వాడ‌డ‌డంతోపాటు అనేక ప్ర‌య‌త్నాల‌ను చేస్తూ ఉంటాం. స‌హజసిద్ధంగా ఇంట్లోనే ఫేస్ వాష్‌ ల‌ను, ఫేస్ ప్యాక్ ల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై అధికంగా ఉండే జిడ్డు, మృత క‌ణాలు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ఎండ వ‌ల్ల పేరుకుపోయిన న‌లుపు తొల‌గిపోవ‌డ‌మే కాకుండా చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఇంట్లోనే స‌హ‌జసిద్ధ‌ ప‌దార్థాల‌తో ఫేస్ వాష్ ను, ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. వీటిని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫేస్ వాష్ ను, ఫేస్ ప్యాక్ ను త‌యారు చేయ‌డంలో మ‌న‌కు నిమ్మ‌ర‌సం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చ‌ర్మంపై జిడ్డును, మొటిమ‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను తొల‌గించ‌డంలో నిమ్మ ర‌సం స‌హాయ‌ప‌డుతుంది. అయితే పొడి చ‌ర్మం ఉన్న వారు మాత్రం నిమ్మ‌ర‌సాన్ని చాలా త‌క్కువ మోత‌దులో ఉప‌యోగించాలి. నిమ్మ ర‌సాన్ని అధికంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రింత పొడిబారే అవ‌కాశం ఉంటుంది. అలాగే పొడి చ‌ర్మ త‌త్వం ఉన్న వారు నేరుగా కూడా నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించ‌కూడ‌దు. దీనిని పాల‌లో లేదా నీళ్లలో క‌లుపుకుని ఉప‌యోగించాలి. నిమ్మ ర‌సాన్ని ఉప‌యోగించి ఫేస్ వాష్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Lemon For Beauty use this wonderful remedies
Lemon For Beauty

ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సాన్ని తీసుకుని అందులోనే ఒక టేబుల్ స్పూన్ క‌ల‌బంద గుజ్జును వేసి బాగా క‌ల‌పాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ తేనెను, ఒక టేబుల్ స్పూన్ నీటిని పోసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని దూదితో కానీ, చేత్తో కానీ ముఖానికి రాసుకుంటూ 3 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా మ‌ర్ద‌నా చేసిన 5 నిమిషాల త‌రువాత ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఇప్పుడు నిమ్మ ర‌సాన్ని ఉప‌యోగించి ఫేస్ ప్యాక్ ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సాన్ని తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ట‌మాటా రసాన్ని కూడా వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చంద‌నం పొడిని, ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెను కూడా వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఉప‌యోగించే ముందు ముందుగా తెలియ‌జేసిన ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుక‌వాలి. ఆ త‌రువాత ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకోవాలి.

15 నిమిషాల త‌రువాత ముఖాన్ని నీటితో క‌డుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వాడ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల న‌ల్ల‌బ‌డిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ రంగులోకి వ‌స్తుంది. అంతేకాకుండా ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు కూడా తొల‌గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డుతుంది. ఈ విధంగా ఇంట్లోనే నిమ్మ‌ర‌సాన్ని, ఇత‌ర ప‌దార్థాల‌ను ఉప‌యోగించి ముఖాన్ని అందంగా నిగ‌నిగ‌లాడేలా చేసుకోవ‌చ్చు.

D

Recent Posts