Facial : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఫంక్ష‌న్‌కు వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా ఫేషియ‌ల్ చేసుకోండి..!

Facial : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోలేక‌పోతారు. ముఖంపై మ‌చ్చ‌లు, న‌లుపుద‌నంతో అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి స్క్ర‌బింగ్, ఫేస్ ప్యాక్ వంటి ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. వాటి కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అలాగే గంటల‌ కొద్ది స‌మ‌యాన్ని వేచిస్తూ ఉంటారు. ఎక్క‌డికి వెళ్లే ప‌ని లేకుండా, అలాగే ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే మ‌నం ముఖాన్ని అందంగా, తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. మ‌న ఇంట్లోనే స్క్ర‌బింగ్, ఫేస్ ప్యాక్ వంటి ప‌ద్ద‌తుల‌ను పాటించి ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ముందుగా మ‌నం స్క్ర‌బింగ్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ కాఫీ పౌడ‌ర్, ఒక టీ స్పూన్ చ‌క్కెర వేసి క‌ల‌పాలి. దీనిని వాడ‌డానికి ముందుగా రోజ్ వాట‌ర్ లో దూదిని ముంచి దానితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. త‌రువాత త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని స‌ర్య్కుల‌ర్ మోష‌న్ లో సున్నితంగా రుద్దాలి. ఇలా 3 నుండి 5 నిమిషాల పాటు రుద్దిన త‌రువాత దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత సాధార‌ణ నీటితో ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌లుపు, మురికి, మృత‌క‌ణాలు, దుమ్ము, ధూళి అంతా తొల‌గిపోతుంది. ఇలా స్క్ర‌బింగ్ చేసుకున్న త‌రువాత ముఖానికి ప్యాక్ ను వేసుకోవాలి.

make facial at your home simple method
Facial

ఈ ప్యాక్ ను వేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక టీ స్పూన్ కాఫీ పౌడ‌ర్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టీ స్పూన్ శ‌న‌గ‌పిండి వేసి క‌ల‌పాలి. సున్నిత చ‌ర్మం ఉన్న వారు నిమ్మ‌ర‌సానికి బ‌దులుగా రోజ్ వాట‌ర్ ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్ర‌మాన్ని స్క్ర‌బింగ్ చేసుకున్న త‌రువాత ముఖానికి రాసుకోవాలి. ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌లుపు, మృత‌క‌ణాలు తొల‌గిపోయి ముఖం అందంగా, తెల్ల‌గా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా మ‌న ఇంట్లోనే స్క్ర‌బింగ్, ఫేస్ ప్యాక్ వంటి వాటిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చులో మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు.

Share
D

Recent Posts