Cheeks : పీక్కుపోయిన మీ బుగ్గ‌లు గుండ్రంగా.. అందంగా మారుతాయి.. ఇలా చేయాలి..!

Cheeks : మ‌నం అందంగా క‌నిపించాలంటే మ‌న ముఖంలో ప్ర‌తి భాగం కూడా అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలి. మ‌న ముఖానికి అందాన్ని తెచ్చే వాటిల్లో మ‌న బుగ్గ‌లు కూడా ఒక‌టి. శ‌రీరం అందంగా, చ‌క్క‌టి ఆకృతిలో ఉన్న‌ప్ప‌టికి కొంద‌రికి బుగ్గ‌లు లోప‌లికి పోయిన‌ట్టు ఉంటాయి. కొంద‌రికి బుగ్గ‌లు అస‌లు ఉన్నాయా లేదా అన్న‌ట్టు ఉంటాయి. ముఖం నిర్జీవంగా మారుతుంది. కళ్లు గుంత‌లు ప‌డి లోప‌లికి పోయిన‌ట్టు ఉంటాయి. బుగ్గ‌లు చ‌క్క‌గా, గుండ్రంగా, అందంగా ఉంటేనే మ‌న ముఖం అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. బుగ్గ‌లు పీక్కుపోయిన‌ట్టు ఉన్న వారు కింద చెప్పే కొన్ని ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల బుగ్గ‌లను అందంగా, గుండ్రంగా మార్చుకోవ‌చ్చు.

బుగ్గ‌ల‌ను అందంగా మార్చే ఆ ఇంటి చిట్కాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ర‌కాల వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల మ‌నం మ‌న బుగ్గ‌ల‌ను అందంగా మార్చుకోవ‌చ్చు. అలాంటి వాటిల్లో డీప్ బ్రీత్ వ్యాయామం కూడా ఒక‌టి. బుగ్గ‌ల నుండి గాలిని పీల్చుకుని ఆ గాలిని వ‌ద‌ల‌కుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. త‌రువాత కొద్ది కొద్దిగా ఆ గాలిని వ‌దిలేయాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మ‌న బుగ్గ‌లు గుండ్రంగా మార‌తాయి. అలాగే ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల రోజ్ వాట‌ర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ గ్లిజ‌రిన్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని మ‌న బుగ్గ‌ల‌పై సున్నితంగా రాసుకుని మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బుగ్గ‌లు కాంతివంతంగా త‌యార‌వుతాయి.

make your cheeks healthy and beautiful like this remedies
Cheeks

బుగ్గ‌ల‌పై చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. బుగ్గ‌లు తాజాగా, అందంగా మారతాయి. బుగ్గ‌లు గుండ్రంగా అవ్వ‌డానికి ఈ చిట్కా ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డంతో పాటు బుగ్గ‌లు గుండ్రంగా ఉండ‌డానికి త‌గిన ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. రోజూ రెండు గ్లాసుల పాల‌ను తాగాలి. ఒక గ్లాస్ పాల‌ను ఉద‌యం పూట అలాగే మ‌రో గ్లాస్ పాల‌ను రాత్రి పూట తాగాలి. అలాగే ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ ప్ర‌తిరోజూ బుగ్గ‌ల‌కు సంబంధించిన వ్యాయామం చేస్తూ అలాగే ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మ‌నం అంద‌మైన‌,గుండ్రంటి బుగ్గ‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts