Pimples Home Remedies : మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా యుక్తవయసులో ఉన్న వారు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, జిడ్డు చర్మం, హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల చేత మొటిమలు వస్తూ ఉంటాయి. మొటిమలతో పాటు వాటి స్థానంలో మచ్చలు కూడా ఏర్పడతాయి. అలాగే కొందరిలో ఈ మచ్చలు హైపర్ పిగ్మేంటేషన్ గా కూడా మారవచ్చు. చాలా మంది మొటిమలు, వాటి తాలూకు మచ్చల నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఎటువంటి ఫలితం ఉండదు. అయితే మొటిమలతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే సహజ చిట్కాలను పాటించడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఈ చిట్కాలను పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం అందంగా తయారవుతుంది. మొటిమలను తగ్గించే సహజ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమలతో బాధపడే వారు కీరదోస రసాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కీరదోస రసాన్ని దూదితో మొటిమలపై రాసి ఆరే వరకు ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే చర్మంపై మచ్చలతో బాధపడే వారు కొబ్బరి నూనెను వాడాలి. రాత్రి పడుకునే ముందు మచ్చలపై కొబ్బరి నూనెను రాసి మర్దనా చేసుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. ఇక మొటిమలతో బాధపడే వారు పసుపును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
పసుపును వాడడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే మొటిమలను తగ్గించడంలో తేనె కూడా మనకు సహాయపడుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకుని తడి ఆరిన తరువాత తేనెను రాసుకోవాలి. తేనెను రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే నిమ్మరసాన్ని వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి వేసుకునే ఏదైనా ప్యాక్ లో అర చెక్క నిమ్మరసం కలిపి రాసుకోవాలి. దీనిని 10 నుండి 15నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే కలబంద జెల్ ను వాడడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి. కలబంద జెల్ ను రాసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మొటిమలు, మచ్చల సమస్య నుండి బయటపడవచ్చు.