Egg Salad : ఎగ్ సలాడ్.. కోడిగుడ్లతో చేసే ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి అలాగే రాత్రి సమయంలో తక్కువగా తినాలనుకునే వారు ఇలా ఎగ్ సలాడ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఎగ్ సలాడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ఈ ఎగ్ సలాడ్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. ఉడికించిన ఎగ్స్ ఉంటే చాలు కేవలం 5 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఎగ్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన వెల్లుల్లి – 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, గింజలు తీసేసి చిన్నగా తరిగిన టమాట – 1, క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, మిరియాల పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
ఎగ్ సలాడ్ తయారీ విధానం..
ముందుగా కోడిగుడ్లను సన్నగా పొడవుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా టాస్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి టాస్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ సలాడ్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.