Rice For Face Beauty : బియ్యంతో వండిన అన్నాన్నే మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బియ్యం మనకు ఎంతో కాలంగా ప్రధాన ఆహారంగా వస్తూ ఉంటుంది. బియ్యంతో వండిన అన్నాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనకు మేలే తప్ప కీడు జరగదు. కేవలం మన ఆకలిపి తీర్చడంలోనే కాదు మన ఆందాన్ని మెరుగుపరచడంలో కూడా బియ్యం మనకు సహాయపడతాయి. బియ్యంలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వివిధ రకాల చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ముఖం నల్లగా మారడం, ముఖంపై మృతకణాలు పేరుకుపోవడం, ముడతలు, చర్మ రంధ్రాలు తెరుచుకోవడం, చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోయి మొటిమలు వంటివి రావడం ఇలా అనేక రకాల చర్మసమస్యలతో బాధపడుతున్నారు.
ఇటువంటి చర్మ సమస్యలకు బియ్యం ఒక చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. బియ్యంతో క్లీన్సర్, స్క్రబర్, ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చక్కటి అందమైన, ఆరోగ్యవంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. బియ్యంతో ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యం నానబెట్టిన నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో రెండు టీ స్పూన్ల పచ్చి పాలను కలపాలి. తరువాత ఇందులో దూదిని ముంచి చర్మానికి రాసుకోవాలి. ఇలాచేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. దీనిని రాసుకున్న తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోకూడదు. దీనిని అలాగే ముఖం మీద ఉంచుకోవాలి.
తరువాత నానబెట్టిన బియ్యాన్ని జార్ లోకి తీసుకోవాలి. ఇందులో తగినన్ని పచ్చిపాలను పోసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇది స్క్రబర్ లా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీనిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకున్న తరువాత నీటితో కడిగివేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తాజా బియ్యంపిండిని తీసుకుని దానిలో పచ్చిపాలను వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. చర్మంపై ఉండే నలుపు, మృతకణాలు తొలగిపోయి చర్మం అందంగా, తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని అందంగా మార్చడంలో ఈ చిట్కా ప్రభావవంతంగా పని చేస్తుంది.