Unwanted Hair On Upper Lip : అవాంఛిత రోమాలు.. ఈ సమస్యతో బాధపడే స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా చాలా మంది నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బండి పడుతుంటారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, త్రెడ్డింగ్ వంటి పద్దతులను అనుసరిస్తారు. వీటి కారణంగా ఆ భాగంలో చర్మం నల్లగా, కఠినంగా మారే అవకాశం ఉంది. ఎటువంటి నొప్పి దుష్ప్రభావాలు లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అవాంఛిత రోమాలను తొలగించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవాంఛిత రోమాల సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం పాలు, పసుపు, శనగపిండిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పసుపు, శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో తగినన్ని పాలను పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి బాగా ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి. అదేవిధంగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను, పంచదారను తీసుకోవాలి. తరువాత అందులో ఎగ్ వైట్ ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. ఆరిన నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
ఒక గిన్నెలో పసుపు, నిమ్మరసం, పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి ఆరిన తరువాత కడిగివేయాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం వల్ల అవాంఛిత రోమాలు త్వరగా తొలగిపోతాయి. అవాంఛిత రోమాలు ఉన్న చోట పసుపు, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని రాసి ఆరిన తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు రాయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అవాంఛిత రోమాలతో బాధపడే వారు నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని రాయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అవాంఛిత రోమాలను తొలగించడంలో బంగాళాదుంప జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ జ్యూస్ రాత్రి పడుకునే ముందు అవాంఛిత రోమాలపై రాయాలి. ఉదయాన్నే నీటితో కడిగి వేయాలి. వారానికి నాలుగు సార్లు ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. నానబెట్టిన పెసర పప్పును పేస్ట్ గా చేయాలి. తరువాత అందులో పాలను పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి ఆరిన తరువాత కడిగివేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు చర్మం కూడా నల్లగా మారకుండా ఉంటుంది.