సహజంగానే ప్రతి ఒక్కరూ తమ జుట్టు పట్ల జాగ్రత్తలు వహిస్తుంటారు. జుట్టు సమస్యలు ఉండొద్దని, చుండ్రు రావొద్దని రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే కొందరికి ఎప్పుడూ ఏం చేసినా జుట్టు రాలుతుంది. అలాంటి వారికి కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనెను కింద తెలిపిన మూడు విధానాల్లో ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఆ మార్గాలు ఏమిటంటే..
1. మూడు చెంచాల కలబంద గుజ్జు, ఐదు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలను తీసుకుని వాటిని బాగా కలపాలి. రాత్రి నిద్రించేందుకు 2 గంటల ముందు ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా రాయాలి. తరువాత 2 గంటలు ఆగి కడిగేయాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రును తగ్గించుకోవచ్చు. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
2. ఒక చెంచా తేనె, రెండు చెంచాల కొబ్బరి నూనె, రెండు చెంచాల పండిన మెత్తని అరటి పండును తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా రాయాలి. 2 గంటల తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
3. ఒక కప్పు పెరుగు, కొబ్బరి నూనె 7 టీస్పూన్లు తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. అర గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జట్టు కాంతివంతంగా మారుతుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365