Besan Flour For Hair : మనం శనగపిండితో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే పిండి వంటలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. శనగపిండితో వంటలతో పాటు మన ముఖ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. శనగపిండితో రకరకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడుతూ ఉంటాం. శనగపిండి మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే శనగపిండి కేవలం మన చర్మ సౌందర్యాన్నే కాదు మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో దోహదపడుతుంది. జుట్టు రాలడం, అలాగే జుట్టు సలుచగా ఉండడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారు శనగపిండితో ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శనగపిండితో హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక ఉల్లిపాయను, 3 టీ స్పూన్ల శనగపిండిని, 4 టీ స్పూన్ల పుల్లటి పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఉల్లిపాయను మెత్తగా మిక్సీ పట్టుకుని దాని నుండి 4 టీ స్పూన్ల ఉల్లిరసాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, శనగపిండి వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు త్వరగా వస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లల్లో పేరుకుపోయిన మురికి, దుమ్ము, ధూళి వంటివి తొలగిపోయి జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా తయారవుతాయి. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా శనగపిండితో హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వారానికి ఒకసారి వాడడం వల్ల జుట్టును అందంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.