Betel Leaves : ఈ ఆకు తింటే కంటి చూపు పెరుగుతుంది.. క‌ళ్ల జోడును ప‌క్కన ప‌డేస్తారు..!

Betel Leaves : నేటి కాలంలో నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. కొంద‌రు రాత్రి ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు మేలుకుని ఉండి ఉద‌యాన్నే తొంద‌ర‌గా నిద్ర‌లేస్తున్నారు. నిద్రలేమికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మాన‌సిక ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గినంత శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వాటిని నిద్ర‌లేమికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. నిద్ర‌లేమి కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. త‌గినంత నిద్ర‌లేని కార‌ణంగా అసిడిటీ, అతిగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, క‌ళ్లు తిర‌గ‌డం, వికారంగా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు.

ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే త‌గినంత నిద్ర‌పోవ‌డం చాలా అవ‌స‌రం. అదే విధంగా నిద్ర‌లేమి కార‌ణంగా వ‌చ్చే ఈ దుష్ప్ర‌భావాల‌ను మ‌నం ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. నిద్ర‌లేమి కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే చిట్కా ఏమిటి.. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న వంటింటినే ఔష‌ధశాలగా మార్చుకుని మ‌న‌లో సంభవించే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు.

Betel Leaves can improve eye sight take in this method
Betel Leaves

మ‌న ఇంట్లో వాడుకునే ప్ర‌తి ప‌దార్థం ఒక ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. మ‌న ఇంట్లో ఉండే త‌మ‌ల‌పాకు, ప‌చ్చ‌క‌ర్పూరాన్ని ఉప‌యోగించి మ‌నం ఇటువంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గాను ముందుగా రెండు లేదా మూడు ప‌చ్చ‌క‌ర్పూరం బిళ్ల‌ల‌ను పొడిగా చేసి వెన్న‌లో వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ పొడిని త‌మ‌ల‌పాకులో వేసి కిళ్లీలా చుట్టుకుని నోట్లో వేసుకుని న‌మ‌లాలి. ఇలా న‌మ‌ల‌గా వ‌చ్చే ర‌సాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్లు తిర‌గ‌డం, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం, వికారంగా ఉండ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అంతేకాకుండా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చు. త‌మ‌ల‌పాకును, ప‌చ్చ‌క‌ర్పూరాన్ని క‌లిపి తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న వేడి త‌గ్గుతుంది. అంతేకాకుండా క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం, క‌ళ్ల మంట‌లు, క‌ళ్ల దుర‌ద‌లు, క‌ళ్ల నుండి నీళ్లు కార‌డం వంటి కంటి సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు కూడా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర‌లేమి కార‌ణంగా వ‌చ్చే దుష్ప్ర‌భావాల‌తోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts