Black Sesame And Almonds : రోజూ తాగితే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు మాయం..!

Black Sesame And Almonds : ఒక చ‌క్క‌టి చిట్కాను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మెడ నొప్పి, అల‌స‌ట‌, నీర‌సం, ర‌క్త‌హీన‌త, శరీరంలో క్యాల్షియం లోపం, ఐర‌న్ లోపం ఇలా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న ఆహార‌పు అలవాట్లే ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల మందులను వాడుతూ ఉంటారు. మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం దూరం చేసుకోవ‌చ్చు.

ఈ పొడిని వాడడం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న‌కు ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం గ‌స‌గ‌సాల‌ను, న‌ల్ల నువ్వుల‌ను, బాదం ప‌ప్పును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో 4 టీ స్పూన్ల న‌ల్ల నువ్వుల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ గ‌స‌గ‌సాల‌ను, 15 బాదం గింజ‌ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 15 రోజుల కంటే ఎక్కువ‌గా నిల్వ ఉంచ‌కూడ‌దు. ఇలా త‌యారు చేసుకున్న పొడిని పాల‌ల్లో క‌లిపి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను పోయాలి. త‌రువాత ఇందులో ముందుగా త‌యారు చేసుకున్న పొడిని 2 టీ స్పూన్ల మోతాదులో వేసుకోవాలి. పిల్ల‌ల‌కు ఒక టీ స్పూన్ మోతాదులో క‌లిపి ఇవ్వాలి. త‌రువాత ఈ పాల‌ను పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

Black Sesame And Almonds take these daily for all types of pains
Black Sesame And Almonds

త‌రువాత ఈ పాల‌ను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచి కొర‌కు బెల్లం లేదా ప‌టిక బెల్లం పొడిని క‌లిపి తీసుకోవాలి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు అయితే ప‌టిక బెల్లాన్ని వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇలా త‌యారు చేసుకున్న పాల‌ను రోజూ రాత్రి ప‌డుకోవ‌డానికి అర గంట ముందు తాగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. నీర‌సం, అల‌స‌ట నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు.

D

Recent Posts