Camphor For Pains : కర్పూరం.. హిందూ సంప్రదాయంలో కర్పూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుడికి హారతిని ఇవ్వడానికి ముఖ్యంగా కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దీనితో అప్పుడప్పుడూ ఇంట్లో ధూపం కూడా వేస్తూ ఉంటారు. అలాగే తీర్థ ప్రసాదాల్లో, కొన్ని రకాల తీపి వంటకాల్లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరం వేసి చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కర్పూరాన్ని వెలిగించగ వచ్చే వాసనను చూడడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే కర్పూరంతో ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే క్రిమి కీటకాలు కూడా నశిస్తాయి. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. కర్పూరం మనకు ఒక పెయిన్ కిల్లర్ గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కండరాల నొప్పులను, కండరాలు పట్టేయడం వంటి సమస్యలను తగ్గించడంలో అలాగే గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు వాపుతో పాటు నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి నొప్పులను తగ్గించడంలో అదే విధంగా ఎక్కువగా పని చేసినప్పుడు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి నొప్పులను తగ్గించడంలో కర్పూరం మనకు ఎంతో సహాయపడుతుంది. నొప్పి కలిగించే భాగంలో నరాలు నొప్పిని మెదడుకు చేరవేస్తాయి. ఈ నొప్పిని కలిగించే నరాలను శాంతిపజేసి నొప్పి తెలియకుండా చేయడంలో కర్పూరం సహాయపడుతుంది. కర్పూరం మీద మెక్సికో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే నొప్పులను తగ్గించుకోవడానికి ఈ కర్పూరాన్ని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో కర్పూరాన్ని వేసి కరిగించాలి. కర్పూరం కరిగిన తరువాత ఈ నూనెను గోరు వెచ్చగా చేసి నొప్పి ఉన్న భాగంలో రాయాలి. ఇలా రాయడం వల్ల నొప్పి కలిగించే నరాలు శాంతించడంతో పాటు ఆ భాగంలో రక్తనాళాలు వ్యాకోచించి రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తప్రసరణ ఎక్కువగా జరగడం వల్ల నొప్పి కలిగించే భాగాల్లో ఉండే విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. కనుక సహజ సిద్దంగా నొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ విధంగా కర్పూరాన్ని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా ఉపయోగించవచ్చు. నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆయింట్ మెంట్ లను, పెయిన్ కిల్లర్ మందులను వాడడానికి బదులుగా ఇలా కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రబావాలు లేకుండా నొప్పులను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.