Cardamom With Saffron : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య ఒకటి. మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ చాలా మంది పడుకున్న వెంటనే నిద్ర పట్టక అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. తక్కువగా నిద్రించడం వల్ల కూడా మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో పడుకోగానే నిద్ర రావాలంటే అదృష్టం ఉండాలన్నా పరిస్థితి నెలకొంది. నిద్రపట్టడం లేదంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ మనలో ఏదో ఒక సమస్య ఉందని భావించాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలో ఉండే నొప్పులు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు వాడే మందుల కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.
అలాగే మనం తీసుకునే ఆహారం కూడా కొన్ని సార్లు మన నిద్రలేమికి దారి తీస్తుంది. కనుక రాత్రి పూట త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను అది కూడా పడుకోవడానికి రెండు గంటల ముందు తీసుకోవాలి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు మానసిక ఒత్తిడికి, ఆందోళనకు వీలైనంత దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గడానికి ధ్యానం, యోగా వంటివి చేయాలి. అలాగే రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగాలి. పాలు తాగడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది. అలాగే పాలల్లో యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వును కలిపి తీసుకోవడం వల్ల మరింత చక్కగా నిద్రపడుతుంది.
అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు గోరింట పూల గుత్తిని దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనం నిద్రించే గదిలో గాలి చక్కగా వచ్చి వెళ్లేటట్టు ఉండాలి. అలాగే పూర్తిగా చీకటిగా ఉండకుండ చూసుకోవాలి. అలాగే గదిలో చక్కటి వాసన వచ్చేలా చూసుకోవాలి. అలాగే మనం నిద్రించే మంచం ఎత్తుగా, విశాలంగా ఉండాలి. దూదితో తయారు చేసిన పరుపులను ఉపయోగించాలి. దూది పరుపు చల్లికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. అలాగే నిద్రించే పురుపు శుభ్రంగా ఉండాలి. మలినాలు లేకుండా చూసుకోవాలి. నిద్రించడం వల్ల మనసు, శరీరం శుభ్రపడతాయి.
దీంతో 18 గంటల పాటు చక్కగా పని చేసుకోవచ్చు. రోజూ ఒక సమయాన్ని నిర్దేశించుకుని నిద్ర వచ్చినా రాకున్నా ఆ సమయానికి పడుకోవాలి. మొదట ఇలా సమయానికి నిద్ర రాకపోయినా క్రమంగా ఆ సమయం కాగానే నిద్ర వచ్చేస్తుంది. అలాగే నిద్రించే ముందు శరీరాన్ని శుభ్రంగా కడుక్కొని నిద్రించాలి. ఈ చిట్కాలను పాటిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గడంతో పాటు నిద్రలేమి కారణంగా వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.