Cloves Powder For Teeth : మీ దంతాలు తెల్ల‌గా మారి మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాను పాటించండి..!

Cloves Powder For Teeth : మ‌న‌లో చాలా మందిలో దంతాలు గార ప‌ట్టినట్టుగా, ప‌చ్చ‌గా ఉంటాయి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, ధూమపానం, నోటిలో ఇన్పెక్ష‌న్స్ వంటి వివిధ కార‌ణాల చేత దంతాలు ప‌సుపు రంగులోకి మారుతూ ఉంటాయి. చాలా మంది ప‌సుపు దంతాల కార‌ణంగా న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతారు. స‌రిగ్గా న‌వ్వ‌లేక‌పోతారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో ల‌భించే వివిధ ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో చాలా మంది నిరుత్సాహ‌ప‌డుతూ ఉంటారు. ఇలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ప‌సుపు రంగులో ఉండే దంతాలు తెల్ల‌గా మార‌తాయి. నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌గ్గుతుంది. నోటిలో ఇన్పెక్ష‌న్ లు త‌గ్గుతాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మార‌తాయి. ప‌సుపు రంగులో ఉండే దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ల‌వంగాల పొడిని, ఆలివ్ నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ల‌వంగాల పొడిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఆలివ్ నూనె వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ తో దంతాల‌ను 2 నిమిషాల పాటు రుద్దాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Cloves Powder For Teeth how to use this must know
Cloves Powder For Teeth

ఇలా రెండు రోజుల‌కొక‌సారి చేయ‌డం వల్ల దంతాలు క్ర‌మంగా తెల్ల‌గా మార‌తాయి. ల‌వంగాలల్లో అలాగే ఆలివ్ నూనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డతాయి. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌డంతో పాటు చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, చిగుళ్ల వాపు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. దంతాలు ప‌సుపు రంగులో ఉన్న వారు ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

D

Recent Posts