Common Cold : దీన్ని తాగితే ఎంత‌టి జ‌లుబు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతుంది..!

Common Cold : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా అలాగే తాగే నీరు, ప్రాంతం మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మస్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా మంది గాభార‌ప‌డిపోయి యాంటీ బ‌యాటిక్ ల‌ను, ద‌గ్గు మందుల‌ను వాడుతూ ఉంటారు. మందులు కాకుండా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో వాము, అల్లం, మిరియాలు వంటి ఈ మూడు ప‌దార్థాలు ఉండ‌నే ఉంటాయి. ఇవి జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ మూడు ప‌దార్థాల్లో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే ఇవి జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గిస్తాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అల్లం మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది.

దీనిలో జింజ‌రాల్ అనే ప‌దార్థం ఉంటుంది. అలాగే అల్లంలో యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. అదే విధంగా మిరియాలు కూడా జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. పెప్ప‌రిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం మిరియాల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ప్పుడు గాలి గొట్టాలు ముడుచుకుపోకుండా చేయ‌డంలో, గాలి స‌క్ర‌మంగా ఆడేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు కూడా వీటిలో అధికంగా ఉంటాయి.

Common Cold home remedy with ginger and pepper
Common Cold

అలాగే క‌ఫాన్ని తొల‌గించ‌డంలో కూడా ఇవి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇక వాములో కూడా అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. వాములో థైమాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఎక్కువ‌గా ఉంటుంది. గాలితిత్తుల‌ను, గాలి గొట్టాల్లో ఉండే ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి వాటిని సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డంలో వాము ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఒక గ్లాస్ నీళ్ల‌ల్లో ఒక ఇంచు అల్లం ముక్క‌, అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి స‌గం గ్లాస్ క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ క‌షాయం గోరు వెచ్చ‌గా అయిన తరువాత టీ మాదిరి కొద్ది కొద్దిగా తాగాలి.

రోజుకు రెండు సార్లు ఇలా తాగ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల నుండి మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క‌షాయాన్ని చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఉప‌యోగించుకోవచ్చు. ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు మందులు వాడ‌డానికి బ‌దులుగా ఇలా స‌హ‌జ‌సిద్దంగా క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉండ‌డంతో పాటు దుష్ప్ర‌భావాల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts